* చెప్పేవానికి వినేవాడు లోకువ.
* చెప్పేవి నీతులు, చేసేవి గోతులు.
* చెప్పేవి శ్రీరంగనీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
* చెయ్యగానని వారికి నీతులు మెండు, చెల్లని రూపాయికి గీతలు మెండు.
* చెయ్యా పెట్టాలేనాతడికి దిశ పన్నెండామడ.
* చెయ్యి అలసిన వేళ తెప్ప దొరికినరీతి (ఈది అలసినప్పుడు).
* చెయ్యి కాలినప్పుడల్లా కుండ వదిలిపెడతామా?
* చెయ్యిచూపి అవలక్షణ మనిపించుకొన్నట్లు.
* చెయ్యి దాచుకుంటాము గాని, కులం దాచుకుంటామా?
* చెయ్యి పుచ్చుకుని లాగితే రాలేదుగానీ, ఇంటికి చీటీ వ్రాసాడుట.
* చెరు(ఱు)కా ! బెల్లం (పెట్టు) అంటే పెడుతుందా?
* చెరుకు అని వేళ్ళతో పెరకకూడదు.
* చెరుకు ఉండేచోటుకి చీమలు తామే వస్తవి.
* చెరుకుకు చెఱువు సూలంగి.
* చెరుకు కొనఏమి, మొదలేమి?
* చెరుకు తియ్యనని వేళ్ళతో గూడా తిన్నట్లు.
* చెరుకుతోటలో ఏనుగు పడినట్లు.
* చెరుకు నమలడానికి కూలీ అడిగినట్లు.
* చెరుకు పిప్పికి ఈగలు మూగినట్లు.
* చెరుకు వంకరబోతే, తీపి చెడుతుందా?
* చెఱకుతోటలోన చెత్తకుప్పుండిన కొంచమైన దాని గుణము చెడదు.
* చెఱకుదిన్న నోరు చేదారగించునా?
* చెఱకురసము కన్న చెలిమాట తీపురా.
* చెఱకువిల్తుడు విరహిణులపాలిటి పచ్చితురక.
* చెఱపకురా చెడేవు, ఉరకకురా పడేవు.
* చెఱపటానికి చేట పెయ్య చాలును.
* చెఱపటానికి చేతులు వస్తాయిగానీ, నిలవడానికి మతులు రావు.
* చెఱువు ఎండితే చేపలు బయటపడతాయి.
* చెఱువు ఎండిపోయి, చేను బీడైతే కరణం పెండ్లానికి కాసులదండట.
* చెఱువు వోడు, ఊరు పాడు.

No comments:
Post a Comment