Sunday, July 14, 2019

ప - ఫ >>>> 15

* పాళ్ళు పన్నెండు, దెబ్బలు చెరి సగం.
* పావలాకు పడుకుంటే, పందుం బియ్యం బేపి తినిపోయిందట.
* పావులా సంపాదనగాడికి వరహా లంజ వరుస గాదు.
* పాసిన కూడు పక్వానికి వస్తుందా?
* పాసిన కూట్లో కలిపోస్తే పదునుకు వస్తుందా?
* పాసిన గుమ్మడికాయ బాపనయ్యకు దానం ఇమ్మన్నట్లు.
* పాసు ముండా! అంటే, పట్టుతల్లి అన్నట్లు.
* పింగు తెరచిన ఈగలదాడి.
* పింజారి మందు, లంజ పొందు.
* పింజారి పితుకులాట, కురువ గుద్దులాట (పింజారి=దూదేకుల, కురువ=గొఱ్ఱెల మేకల పెంచు ఒక జాతి).
* పిండానికి గతిలేకపోయినా, పెగ్గెలకు లోటులేదు.
* పిండికి తగ్గ పిడచ.
* పిండి కొద్దీ నిప్పటి (నిప్పటి=అరిసె).
* పిండి కొద్ది రొట్టె, తిండికొద్ది పసరం.
* పిండి గొన్నవానివద్ద రొట్టె గొన్నట్టు.
* పిండీ బెల్లం ఇచ్చి, పిన్నమా నీ ప్రసాదం అన్నట్లు.
* పిండి బొమ్మను చేసి పీతమీద కూర్చుండబెడితే, ఆడబిడ్డతనాన అదిరదిరి పడిందట.
* పిండీ, ప్రోలు లేనిదే పెండ్లవునా?
* పిండేవాడు పిండితే పిటుకురాయైనా పాలిస్తుంది.
* పిందెలో పండిన పండు.
* పిక్కలెగేయ బలిసినా దున్న ఏనుగు కాదు.
* పిచ్చి కుదురింది, రోకలి తలకు చుట్టమన్నాడట.
* పిచ్చి కుదిరితేగానీ పెళ్ళికాదు, పెళ్ళి ఐతేగానీ పిచ్చికుదరదు.
* పిచ్చివాడికి లోకమంతా పిచ్చే!
* పిచ్చివానికి పింగుమీదనే ఆలాపన
* పిచ్చివాని చేతి రాయి తగిల్తే తగులుతుంది, తప్పితే తప్పుతుంది.
* పిచ్చివానికి పిల్లనిస్తే వేలుబెట్టి ఎడం జేసినాడట.
* పిచ్చుకమీద బ్రహ్మాస్త్రం.
* పిచ్చుకకుంటుమీద భాగీరథి వచ్చినట్లు.
* పిచ్చుగుంటవాని పెండ్లి ఎంత? వైభవమెంత? (పెడాకు లెంత?)

No comments:

Post a Comment