Saturday, July 13, 2019

న >>>> 14

* నీసరి వేల్పులు లేరు, నాసరి దాసులు లేరు.
* నీ సాకు చట్టుబండలు కాను, నాలుగు బేకులు బేక మన్నాడట (అన్నం వడ్డనలో0 ( సాకు = చాలు, బేకు =కావాలి, కన్నడములో)
* నా సోకే సొఱాకు, నీ ముఖమే బీరాకు, నావంక చూడబోకు, నాకసలే చిరాకు.
* నుచ్చు గట్టిన రొమ్ము- కంపలో గాచినకాయ ఒకటే (ఉపయోగపడవు; నుచ్చు = గొఱ్ఱెల మేకల పాలు పొలాలలో త్రాగకుండా చన్నులకు కట్టు గుడ్దపీలిక).
* నుదుట వ్రాయనిదే నోట పలుకదు.
* నుదురు బత్తుడు, నోరు తోడేలు.
* నుయ్యి తీయబోతే దెయ్యం బయటపడినట్లు.
* నుయ్యి దాటేవానికి చింతాకంత ఎడమైనా ఎడమైనట్లే.
* నువ్వుకు నూరు రోగాలు (తెగుళ్ళు).
* నువ్వు చస్తే బొబ్బర్లు.
* నువ్వులకు ఏడు దుక్కులు, ఉలవలకు ఒకే దుక్కి.
* నువ్వులకు తగిన నూనె.
* నువ్వులూ నూనె ఒకటి, నూనె (గాండ్ల) గమళ్ళవాడే వేరు.
* నువ్వులు వేసి ఆవాలు పండమన్నట్లు.
* నూకల కేడ్చి యేడ్చి, తవుడు కేడ్చినాడట.
* నూక సంకటికి నూనెధార.
* నూటికి నూలుపోగు, కోటికి గోవుతోక.
* నూటికి పెట్టి, కోటికి గొరిగించినట్లు.
* నూటిని పొడిచి సెలగ అన్నట్లు.
* నూటివఱకు నన్ను కాపాడితే, ఆతరువాత నిన్ను కాపాడుతా.
* నూత పడెదవా, పాతర పడెదవా?
* నూతి కప్పల విధానం (కూపస్థ మండూకం).
* నూతి కప్పకు సముద్రం సంగతేమి తెలుసును?
* నూతి దరిచేరి, నోట గొణిగితే ఈత వస్తుందా?
* నూతిలో నీరు తోడుకోవాలి గానీ, తనంతటతానే పైకివస్తుందా?
* నూతిలో పడబోయి తాప వెదకినట్లు (తాప=తెప్ప).
* నూనె అన్నంతిని, నూతికి కాళ్ళు జాపిందట.
* నూనె కొలిచిన గిద్దకు జిడ్డు కాదా?
* నూనెతో మండే దీపం నువ్వులతో మండునా?
* నూనెలేని వత్తి ఎగదోస్తే నేమి? దిగదోస్తే నేమి?

No comments:

Post a Comment