* గోరంత ఆలశ్యం, కొండంత నష్టం.
* గోరంత నీరైనా గోతులు చేస్తుంది.
* గోరంతను కొండంత చేయడం.
* గోరీకాడ నక్కవలె.
* గోరుచుట్టుపై రోకలిపోటు.
* గోరువాచిన వేలంత, వేలువాచిన కాలంత, కాలువాచిన రోలంత, రోలువాచిన ఎంత?
* గోల గోవిందుడిది, అనుభవం వేంకటేశ్వరునిది.
* గోలుకొండ ఉద్యోగం గొఱ్ఱెతోక ఒకటి.
* గోవధ కావించి గోరోజనం రోగార్తులకిచ్చిన పుణ్యాత్ముడగునా?
* గోవును గోలెం (తొట్టి) దగ్గరకు తీసుకు వెళ్ళగలం కానీ, కుడితి తాగించగలమా?
* గోవులకు కోసి చెప్పులు దానం చేసినట్లు.
* గోవులేని ఊళ్ళో గోడుగేదే శ్రీమహాలక్ష్మి.
* గోవే తల్లి, ఎద్దే తండ్రి.
* గ్రహచారం చాలకపోతే వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకొన్నాడట.
* గ్రచారం చాలక రాచారంపోతే, జన్మనక్షత్రంజూచి నెత్తి గొరిగినదట.
* గ్రామంలో ఒక కోమటి ఉంటే వెయ్యి రూపాయలు నష్టం, ఒక ఆబోతు ఉంటే వెయ్యి రూపాయలు లాభం.
* గ్రామమిచ్చిన దాత ఇల్లు కట్టించి ఇవ్వలేడా?
* గ్రామశాంతికి బోడితల.
* గ్రాసం లేని కొలువు-మీసంలేని బ్రతుకు.
* గ్రాసం లేని కొలువు- రసంలేని కావ్యం.
* గ్రాసం లేని బంతుకు రోసం ఎక్కువ.
* ఘంటాకర్ణునికి అష్టాక్షరి ఉపదేశం చెయ్యబోయినట్లు.
* ఘటము లెన్నియైన గగనంబదేకమౌ.
* ఘడీయకు హాజీ, ఘడియకు ఫాజీ
* ఘడియ తీరుబాటు లేదు, దమ్మిడి ఆదాయం లేదు.
* ఘడియ పురుసత్తు లేదు, గవ్వ సంపాదన లేదు.
* ఘనమగు పులి గోరూపము కాగానే బిడ్డకు పాలు కల్గునా?
* ఘోటక బ్రహ్మచారి.

No comments:
Post a Comment