* నెరిధనమును దాయల (దాయాదుల) కిచ్చితే నెనరు మాటలు కలుగునా?
* నెఱజాణ నేరననును, నేర్తు ననువాడు నింద పాలగును.
* నెఱ ఱంకులాడికి నిష్ఠ మెండు.
* నెల తక్కువైనా రాజుఇంట పుట్టమన్నారు (కాపింట; కోమటింట).
* నెల తక్కువైనా మొగపిల్లవాడే మేలు.
* నెల బాలుడికి నూలుపోగు.
* నెలవు దొంగ ప్రాణం చుట్టు.
* నేటి కవులు సిరాలో ఎక్కువ నీళ్ళు కలిపి వ్రాస్తున్నారు.
* నేటి బిడ్డే రేపటి తండ్రి.
* నేటి విత్తే రేపటి చెట్టు.
* నేడు గంత వేసి, రేపు ఎక్కినట్లు.
* నేడు నవ్వు, రేపు (మరునాడు) ఏడ్పు.
* నేడు నిప్పు, రేపు నీఱు (నీఱు= నివురు, బూడిద).
* నేతికుండ నేలబెట్టి, ఉత్తకుండను ఉట్టిమీద పెట్టినట్లు.
* నేతిగూన (గిన్నె) చేతబూని, నిచ్చెన ఎక్కినట్లు.
* నేతిబీరకాయ; విభూతిపండు; జీలకర్ర (సామ్యము; బీరలో నెయ్యి లేనట్లు).
* నేనాడేదే బండిసిరి ఆట, మా పెదబావ చూస్తాడంటే ఎలా?
* నేను పుట్టకపోతే నీకు పెండ్లానే లేకపోవునే అంటే, నీవు పుట్టకపోతే నీ తల్లినే పెళ్ళాడి ఉందు నన్నాడట.
* నేనుపోతే మజ్జిగనీళ్ళకు దోవలేదు గానీ, నా పేర చీటీపోతే పెరుగు పంపుతారు అన్నాడట.
* నేను మందు తింటా, నీవు పథ్య ముండు మన్నట్లు.
* నేను లేకపోతే ఎవణ్ణి పెళ్ళాడువంటే, నీ అబ్బంటోడు ఇంకొకడు పుట్టిఉంటా డన్నదట.
* నేను ఒకపొద్దే, నా మగడు ఒక్క పొద్దే, పిండీ, బియ్యం లేక పిల్లలూ ఇక పొద్దే.
* నేనూ బండెద్దునని గుద్దకు పేడ రాసుకొన్నట్లు.
* నేములు కాచిన భూములు పండును.
* నేయిచెడి నూనెచెడి పొగమాత్రం మిగిలింది (హోమం).
* నేరక నేరక నేరేళ్ళు తినబోతే, నేరాలు ఒడిగట్టినట్లు.
* నేరము గలిగినచోటనే కారుణ్యము.
* నేరేళ్ళు నెగ్గేది, మారేళ్ళు (మామిళ్ళు) మగ్గేదీ- మంచికాలానికి లక్షణం.
* నేరేళ్ళు పండితే నేలలు పండును.
* నేర్చి చెప్పిన మాట నెరవాది మాట.

No comments:
Post a Comment