Saturday, July 13, 2019

న >>>> 17

* నేర్చినమ్మ ఏడ్చినా బాగుంటుంది.
* నేర్చిన బుద్ధి ఏర్చినా పోదు.
* నేర్చి బ్రతికినవాడు, నేర్వక చెడ్డవాడూ లేడు.
* నేర్పు కలిగినమ్మ చేతితో అతిరసాలు కాలిస్తే, ఓర్పుగలమ్మ ఒడిలో గట్టుకొని పోయిందట.
* నేర్చుబో చంకల బిడ్డలాడిపడ సారసలోచన మాటలాడగన్.
* నేర్పులేనివాని నెరయోధుడందురా?
* నేలది తీసి నెత్తికి రుద్దుకొన్నట్లు.
* నేలమీద వ్రాసిన బూరెను ఇంత తింటావా? అంత తింటావా? అన్నట్లు.
* నేలమునగకు నిచ్చెన వేసేవాడు.
* నేల మెత్తనిదని మోచేత త్రవ్వినట్లు.
* నేల విడిచిన సాము - తాళం విడిచిన పాట.
* నేల విడిచిన సాము - నీరు విడచి ఈత.
* నేల విడిచిన సాము - మతి విడిచిన మాట.
* నేసేవాణ్ణి నమ్ముకొని పొలిమేర జగడం ఒప్పుకొన్నట్లు.
* నైజ గుణానికి, గుడ్డికంటికి మందులేదు.
* నొచ్చినవాడా నువ్వులు చల్లమన్నట్లు.
* నొచ్చి నొసట పలుకదు, వచ్చినవాని విడువదు.
* నొప్పించక తానొవ్వక తప్పించుక తిరుగువాడె ధన్యుడు.
* నొప్పు లెత్తుకున్నప్పుడే మంత్రసానికి దెప్ప సందు.
* నొయ్యకుండా చేస్తే కొయ్యకుండా పండును.
* నొసట పళ్ళు లేవు, నోట్లో కళ్ళు లేవు.
* నొసట నామాలు, నోట బండబూతులు.
* నొసటమీది వ్రాత నులిమిన పోవునా?
* నొసట వ్రాసిన వ్రాత నులిమితే చెడదు.
* నొసట వ్రాసిన వ్రాలు (వ్రాత) చెఱిపేదెవరు?
* నొసట వ్రాసిన వ్రాలు కన్నా కలదా వెయ్యేళ్ళు చింతించినన్.
* నొసలు భక్తుడు నోరు తోడేలయా.
* నోచిన వారి సొమ్ములు నో(య)మనివారికి వచ్చునా?
* నోటిఆయి రొమ్ముకు తగులుతుంది.
* నోటికి చేతికి చీకటి లేదు.

No comments:

Post a Comment