* చెవిటివాని ఎదుట శంఖం ఊదితే, అది కొరకటానికి నీ తండ్రి తాతల తరము కాదన్నాడట.
* చెవిలో చెప్పిన మాట గానీ, అరచి చెప్పినమాట గానీ వినదగియుండవు.
* చెవిటివానికి వినిపించాలంటే శంఖచక్రాలవాడు దిగిరావాలి.
* చెవిదగ్గర కందురీగ (కంతిరీగ) వలె.
* చెవుడు, చెవుడూ అంటే, తవుడు తవుడూ అన్నట్లు.
* చెవులు కోసుకు పోతుంటే, కుట్టుకాడలకు ఏడ్చినట్లు.
* చెవులపిల్లి ఎదురైతే చేటు వస్తుంది.
* చెవులో గుమి(బి)లికి ఏపుల్ల ఐతేనేమి గెలుక్కోను.
* చెవ్వాకు పోయినమ్మకు దుఃఖమూలేదు, దొరికినమ్మకు సంతోషమూ లేదు.
* చేటను కొట్టి పిల్లిని బెదరించినట్లు.
* చేటభారతము - కంప రామాయణము.
* చేటలో వెలగకాయల వలె.
* చేటు ఎరుగని చేడె మొగుడికి పెళ్ళి చేసిందట.
* చేటుకాలమయిన చెరువ నల్పుడే చాలు.
* చేటుకాలానికి చెడ్డ బుద్ధులు.
* చేటు మూడినప్పుడు మాటలు దోపవు.
* చేటూ పాటూ ఎఱుగనమ్మ ఇల్లెక్కి పిండి కొట్టిందట.
* చేటూ పాటూ ఎఱుగనమ్మ మగని పెళ్ళి కెళ్ళిందట.
* చేటెడు తిని చెడితి, వాకిలి దాటి పడితి.
* చేతకానమ్మకు చేష్టలు మెండు, చెల్లని రూకకు గీతలు మెండు.
* చేతకానమ్మకు శౌర్యమెక్కువ.
* చేతనైన మగోడు (మగవాడు) చాలాపొద్దున లేచి ఊడ్చుకొని చల్లుకొని ఇంకొకచోట వండుకొన్నాడట.
* చేత వెన్నయుండ నేతికేడ్చెడి వారె.
* చేతికలుపు - వైద్యునిచేతి తళుకు.
* చేతికి అందినది వాతి కందదు.
* చేతికి దొరికిన రత్నం నాచుక పోయినట్లు.
* చేతికిబట్టిన జిడ్డు లెక్కకు రాదు.
* చేతిచమురు భాగవతం చెప్పుకొన్నట్లు.
* చేతిమల్లెపూవు గుండ్రాతికి ఓర్వజాలునా?
* చేతిలో ఉంటే అర్ధం, చేరువలో ఉంటే పెళ్ళాం.

No comments:
Post a Comment