Sunday, July 14, 2019

ప - ఫ >>>> 17

* పిఱికి వాని బింకం పిసరులో ఇంకు.
* పిఱికి వారికే పిడికెడంత మీసాలు.
* పిఱ్ఱమీద కొడితే ఫిర్యాదు లేదు.
* పిఱ్ఱల చప్పుడేగానీ దారి జరుగలేదు.
* పిఱ్ఱలు చూచి పీట వేసినట్లు.
* పిఱ్ఱలు చూచి పీట వెయ్యి, ముఖం చూచి బొట్టు పెట్టు.
* పిల(లు)వకుండా పోయినప్పుడు, గెంటకుండా పొమ్మనటమే కట్నం.
* పిలవని పేరంటము, చెప్పని ఒక్క పొద్దు.
* పిలవని పేరంటానికి వెళితే పీటకోళ్ళ దెబ్బ.
* పిలిచి పిల్లనిస్తా మంటే, కులం (తక్కువ) లేత అన్నట్లు.
* పిలిచి పిల్లనిస్తా మంటే, మెల్ల అన్నాడట.
* పిలిచి పెద్దపులికి పేరంటం పెట్టినట్లు.
* పిలిచేవారుంటే బిగిశేవారు శానామంది.
* పిలిస్తే పలుకుతుంది కరవు-రాయలసీమలో, పిలవకుండానే పలుకుతుంది అనంతపురంలో.
* పిలిస్తే బిగిస్తే సరికాని, వస్తే వాడి అబ్బతరమా?
* పిలువని పేరంటము, వలవని చెలిమి వంటిది.
* పిల్ల ఉన్నమ్మకు పిడికెడు చోటెక్కువ.
* పిల్లకాకి కేమి తెలుసు ఉండేలుదెబ్బ.
* పిల్లకాకి కేమి తెలుసు వింటిలిదబ్బ యేటు (వింటిలిదబ్బ = ఉండేలు దబ్బ).
* పిల్లకాయలకు, పీటకోళ్ళకు చలిలేదు.
* పిల్లకు ఏమిపెట్టి పంపినారు శాస్త్రిగారు అంటే- పేదవాళ్ళము ఏమి పెట్టగలము? మీబోటి మహరాజులైతే వేలుబెట్టి పంపుతారు అన్నాడట.
* పిల్ల కుదిరినా కుదరకపోయినా వచ్చే నెలలో పెండ్లి నిజమన్నాడట.
* పిల్లకు సొమ్ము పెట్టిచూడు, గోడకు సున్నము కొట్టి చూడు.
* పిల్ల గలవాడు పిల్ల కేడిస్తే, కాతిగలవాడు కాసు కేడ్చాడట.
* పిల్ల చచ్చినా పురిటికంపు (పీతికంపు) పోలేదు.
* పిల్ల నిచ్చిన చోటికి, పీతిరిదొడ్డీకి పోక తప్పుతుందా?
* పిల్ల నిచ్చినవాడు ఈగ, పుచ్చుకున్న వాడు పులి.
* పిల్ల పిడికెడు, గూను గంపెడు.
* పిల్ల పుట్టకముందే కుల్లగుట్టినట్లు.
* పిల్ల పుట్టగానే పాలు పడ్డట్లు.

No comments:

Post a Comment