Sunday, July 14, 2019

ప - ఫ >>>> 18

* పిల్ల పెత్తనం, పల్లెటూరి సావాసం.
* పిల్ల బావిలో పడ్డదిరా అంటే, ఉండు! అంబలి తాగివస్తానన్నట్లు.
* పిల్లని గిల్లి పైన పప్పర గొట్టినట్లు.
* పిల్ల పిచ్చుకంత, పింగు మద్దెలంత.
* పిల్ల ముడ్డి గిల్లి (ఉయ్యాల ఊచినట్లు) జోలపాడినట్లు.
* పిల్ల ముద్దుగానీ పియ్య ముద్దా?
* పిల్లలున్న వాడికి, పసులున్నవాడికి సిగ్గుండరాదు.
* పిల్లలు లేని ఇంట్లో తాత తడుము లాడినట్లు.
* పిల్లలు లేని ఇంట్లో ముసలోడు దోగాడిండంట (దోగాడట).
* పిల్లలు లేనిది ఇల్లు కాదు, పిట్టలు లేనిది తోపు కాదు.
* పిల్ల వాడని పక్కలో వేసుకుంటె, పెద్దోడు (పెద్దవాడు) కొట్టినట్లు కొట్టినాడని (మేనత్త మాట).
* పిల్లవాడు మూలా నక్షత్రంలో పుడితే, మూల పీకివేసుకుపోతాడట.
* పిల్లవానికి పీట వేసి, పిల్లకు చేట వేసినట్లు.
* పిల్లా పిలగానికి పెళ్ళిచేస్తే, ఎలేసి (వెలివేసి) ఎడం చేశాడట.
* పిల్లా! పిల్లా! నువ్వుల చెట్టుకు నూనె ఎక్కడిదంటే, మాఅమ్మ తొలి సమర్తకీ, మలి సమర్తకీ ఎక్కడున్నావు అందట.
* పిల్లా! పిల్లా! పెట్టనిస్తావా? అని రావూరు రసికు డడిగితే, నీకు అమ్మనయ్యా అన్నదట నెల్లూరి నెరజాణ.
* పిల్లా! నీదేమిపోతుంది? మా యమ్మకు కాసేపు కోడలు కాలేవా? అన్నాడట.
* పిల్లి ఉట్టిచేరులు తెంచగలదు గానీ పాలకుండ పడకుండా (పట్ట)చేయగలదా?
* పిల్లి కండ్లు పోగోరును, కుక్క పిల్లలు రాగోరును.
* పిల్లి కండ్లుమూసుకొని పాలుతాగుతు, ఎవరూ తన్ను చూడలేదని ఎంచుకొన్నదట.
* పిల్లికి ఎలుక సాక్ష్యం.
* పిల్లిగూడా బిక్షం పెట్టదు.
* పిల్లికి చెలగాటం (చెర్లాటం) ఎలుకకు ప్రాణసంకటం.
* పిల్లి నెత్తిన వెన్న (పేరిననెయ్యి) బెట్టినట్లు.
* పిల్లికి రొయ్యలమొలతాడు కట్టినట్లు.
* పిల్లికి మెడలో రొయ్యలు గట్టినట్లు (అందక వదలలేక బాధ పడుట).
* పిల్లి గుడ్డిది అని ఎలుక ముడ్డి చూపిందట.
* పిల్లి తిన్న కోడి పిలిచినా పలుకదు.
* పిల్లి తోక ఎద్దు ముట్టితే, ఎలుక దిక్కు ఎఱ్ఱగించి చూచిందట.
* పిల్లితోక (కాలు) బఱ్ఱెతొక్కితే, ఎలుకమీద మీసాలు దువ్విందట.

No comments:

Post a Comment