* నోటికి తీపు, ముడ్డికి చేటు.
* నోటికి మీరిన కడి మింగరాదు.
* నోటికీ చేతికి ఎంగిలి లేదు.
* నోటి జిగటేగానీ, చేతికి జిగట లేదు.
* నోటితో లేదనేది చేతితో లేదంటే సరి.
* నోటిమీద కొడితే పెడతల వాచిందట.
* నోటి వక్రం గంజి పెడమూట.
* నోటి పట్టం, గంజి పెడ పూట.
* నోటిలో చెక్కెర, కడుపులో కత్తెర.
* నోట్లో నూవుగింజ (అయినా) నానదు.
* నోట్లో ముద్ద, గూట్లో దీపం (జైనులు దీపం పెట్టేదానికి ముందరే భోజనం చేస్తారనుట).
* నోట్లో వేలుపెడితే కరవనేరని నంగనాచి.
* నోరంతా పళ్ళు, ఊరంతా అప్పులు.
* నోరు అంబాలపు (అప్పాలపు) పండు, చెయ్యి (బ)బులుసు ముల్లు.
* నోరు ఉంటే ఊరు ఉంటుంది.
* నోరు ఉంటే పోరు గెలుస్తుంది.
* నోరు ఉన్న తల గాచును.
* నోరు ఉన్నవాడిదే రాజ్యం (ఊరు).
* నోరు కల్లపుట్ట, పేరు హరిశ్చంద్రుడు.
* నోరు చేసే అఘాయిత్యానికి ముడ్డి ఉంది గనక భరిస్తున్నది.
* నోరు నవ్వడం, నొసలు వెక్కిరించడం.
* నోరు పెట్టుకొని గెలవవే ఊర గంగానమ్మ!
* నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది.
* నోరు మాట్లాడుతుంటే నొసలు వెక్కిరించినట్లు.
* నోరు మూస్తే మూగ, నోరు తెరిస్తే ఱాగ (ఱాగ=గయ్యాళి).
* నోరు మూస్తే నొసలు మాట్లాడినట్లు (వాగినట్లు).
* నోరు మూస్తే పెడతల మాట్లాడినట్లు.
* నోరు లేని దయ్యం ఊరు ఆర్పిందట.
* న్యాయ మమ్మువాడు, దోవలు దోచువాడు ఒకటి.
* న్యాయము చెప్పు నాగిరెడ్డీ అంటే, నాకూ ఇద్దఱు పెళ్ళాలే అన్నాడట.
* న్యాయము తప్పినవానికి ఆచార్య కటాక్ష మెందుకు?

No comments:
Post a Comment