Sunday, July 14, 2019

ప - ఫ >>>> 1

* పంచపాండవులంటే నాకు తెలియదా? మంచపుకోళ్ళ వలె ముగ్గురు అని రెండు వేళ్ళు చూపించాడట.
* పంచమినాడు పల్లకి ఎక్కనూ లేదు, అష్టమి నాడు జోలి పట్టనూ లేదు.
* పంచశుభం పంచాశుభం.
* పంచాంగం పోగానే నక్షత్రాలు ఊడిపోతాయా?
* పంచాగ్ని మధ్య మందున్నట్లు.
* పంచినవాళ్లకు పళ్ళు నోరు.
* పంచ కేలరా పత్తి ధర.
* పంజకు ధైర్యము, కల్లుముంతకు ఎంగిలి లేవు.
* పంజరం అందంగా ఉంటే, పక్షికి సంతోషమా?
* పంజరంలో కాకిని పెట్టగానే పంచమస్వరం ఆలపిస్తుందా?
* పంటకు రాని చేలు, పరిభావ మెరుంగగలేనిని ఆలు.
* పంటకు పెంట, వంటకు మంట.
* పంటచేను విడచి పరిగ ఏరినట్లు.
* పంట పెంటలో ఉన్నది, పాడి పురిలో ఉన్నది.
* పంటిపాచి పోయిన యింటిహీనం పోతుంది.
* పండని ఏడు పాటు ఎక్కువ.
* పండని కోర్కెలే బొంకులు.
* పండని నేల పందుం కంటే పండే నేల కుంచెడే చాలు.
* పండని నేల పుట్టెడుకంటే, పండే నేల పందుం చాలు.
* పండాకును చూచి పసరాకు (పచ్చాకు) నవ్వినట్లు.
* పండాకు రాలుతుంటే, కొత్తాకు నన వేస్తుంటుంది.
* పండాకు రాలుతుంటే, పసరాకు నల్లబడుతుంది.
* పండించేవాడు పస్తుంటే, పరమాత్మకూ పస్తే.
* పండిత పుత్రుడు శుంఠ.
* పండితమ్మన్యునకు పాదుకా పట్టాభిషేకం.
* పండిన దినమే పండుగ.
* పండినా, ఎండినా పని తప్పదు.
* పండియు పొల్లు బోయిన పంట.
* పండు కాయుండగా, కసుగాయ తెంచినట్లు (కోసినట్లు).
* పండుగ తొలినాడు గుడ్డల కఱవు, పండుగనాడు కూటికఱవు, పండుగ మఱునాడు మజ్జిగ కఱవు.

No comments:

Post a Comment