* చేసేది శివపూజ, దూరేది దొమ్మరి గుడిసె.
* చేసేపని వదలి నేసేవాని వెంట పోయినట్లు.
* చేసేవి నాయకాలు, అడిగేవి తిరిపాలు, పెట్టకుంటే కోపాలు.
* చేసేవి మాఘస్నానాలు, దూరేవి దొమ్మరి గుడిసెలు.
* చేసేవి లోపాలు, చెపితే కోపాలు.
* చేసేవి శివపూజలు, చెప్పేవి అబద్ధాలు.
* చైత్ర వైశాఖలలో పెండ్లి కావిళ్ళు (సారెకావిళ్ళు), శ్రావణ భాద్రపదాలలో దినం కావిళ్ళు.
* చొప్పవామిలో నిప్పు దాచుకొన్నాట్లు.
* చొల్లంగి తీర్ధానికి చోడిగింజలంతేసి (మామిడిపిందెలు).
* చోటే లేదంటే మూల ఎక్కడ వెదుకుదును అన్నాడట.
* చోద్యం సొరకాయ గుడ్డు పెట్టిందట.
* చోద్యాల సోమిదేవమ్మకు వాద్యారి మొగుడు.
* చోళ్ళు చల్లితే జొన్నలు పండునా?
* చోళ్ళు విసరే తిరగలి, జొన్నలు విసరునా?
* చోళ్ళు విసరే తిరగలి ఆళ్ళు విసరునా?
* చౌక దూబరతిండికి కారణం.
* చౌటినేల వల్ల జలమెల్ల చెడిపోయె.
* చౌడోలు గాడిదపై గట్టినట్లు.
* చౌదంతి నెక్కగానే చక్రవర్తి అగునా?
* ఛీ! కుక్కా అంటే, ఏమక్కా ! అన్నదట.
* ఛీ! ఛీ! అనేదీ ఈ నోరే, శివశివా అనేదీ ఈ నోరే.

No comments:
Post a Comment