Saturday, July 13, 2019

న >>>> 2

* నక్కకొమ్ము తొక్కి వచ్చినాడు (అదృష్టవంతు డనుట).
* నక్క చావ గొఱ్ఱె లేడ్చునా?
* నక్కజిత్తులన్నీ (తంతులన్నీ) నావద్ద ఉండగా తప్పించుకు(క) పోయెరా తాబేటిబుఱ్ఱ అన్నదట.
* నక్కజిత్తులు నారాయణు డెఱుగు.
* నక్కతోక పట్టుకొని నాకలోక మెక్కినట్లు.
* నక్క నడుము తొక్కి వచ్చినాడు (అదృష్టమనుట).
* నక్క నారాయణునికైనా నామం పెడుతుంది.
* నక్క నారాయణు డెక్కడనో, తోకనారాయణు డక్కడనే.
* నక్కను చూచిన వాడెల్లా వేటగాడే.
* నక్క పీనుగును పీకును గానీ బ్రతికిన జంతువు పైకి పోదు.
* నక్క పుట్టి నాలుగు వారాలు కాలేదు, ఇంత గాలివాన ఎన్నడూ చూడలేదు అన్నదిట.
* నక్క బోయిన వెనుక బొక్క కొట్టుకొన్నట్లు.
* నక్క ముదిరితే వఱడు, తొండ ముదిరితే ఊసరవెల్లి.
* నక్క రేలకాయ తినినట్లు.
* నక్కలలో నక్కగా నటించవలె.
* నక్కలు బొక్కలు వెదకును, తక్కిన నాలంజకొడుకు తప్పేవెదకున్.
* నక్కలు మరవలు పారితే కుక్కలు కూటికొల్లవు.
* నక్కలెరుగని బొక్కలు, నాగులెరుగని కోవ(మ)లు (పుట్టలు) గలవా? (కోవలు=పుట్టల శిఖరాలు).
* నక్క వచ్చి కుక్కతోక సవరించినట్లు.
* నక్కవాత మున్ను గొట్టినాడు (చావక బ్రతికినాడనుట).
* నక్క వినయము! కొంగ జపము.
* నక్కా! నక్కా! నా నామం చూడు, తిరిగి చూస్తే తిరుమణి చూడు.
* నగ(గి)రి పేదా? ఉప్పు చేదా?
* నక్షత్రాలు శాశ్వతజ్యోతులైనా చీకటి పడినప్పుడే వెలిగేది.
* నగిరికి ఎంతైనా పెడతాడు కానీ,పెద్దకోడలికి కూడుబెట్టను ఏడుస్తాడు.
* నగుబాట్ల పెండ్లికి నాడే నాగవల్లి.
* నలుగు ముదిరితే తెగులు.
* నట్టింట ఉండి నా భాగ్యమంటే, ఉట్టిమీదు నుంచి ఊడి పడుతుందా?
* నట్టేట పుట్టిముంచినట్లు (మునిగినట్లు) (పుట్టి=పేళ్ళతో చేసిన గుండ్రని బుట్టవంటి చిన్న పడవ).
* నట్టేటిలో చేయి విడిచినట్లు.

No comments:

Post a Comment