* పుంటికూత తిన్నా పుట్టిల్లు, పాయసం తిన్నా పరాయిగడ్డ.
* పుంటికూరలో పుడక రుచి, మాంసంలో (చిగిరెపు) ఎముక రుచి.
* పుండంత మానింది, చేటంత ఉంది.
* పుండు ఒక చోట, మందు ఇంకొక చోట.
* పుండుకు పుల్ల మొగుడు.
* పుండున్న వ్రేలికే పుల్ల తగులుతుంది.
* పుండు పొడిచే కాకికి ఎద్దునొప్పి తెలుస్తుందా?
* పుండు మానినా బెండు మానదు (బెండు=మచ్చ).
* పుండు మీద కారం చల్లినట్లు.
* పుండు మీద కొరవి పెట్టినట్లు.
* పుండు మీదకు నూనె లేదంటే, బూరెలొండవే పెళ్ళామా అన్నట్లు.
* పుక్కిటి పురాణాలతో ప్రొద్దుపుచ్చే (పొట్టబోసికొనే) వాడు పురాణాలు చెప్పగలడా?
* పుచ్చకాయల (గుమ్మడికాయల) దొంగా అంటే, భుజాలు తడుముకొన్నట్లు.
* పుచ్చిన మిరియాలకైనా జొన్నలు సరిరావు.
* పుచ్చిన విత్తులు చచ్చినా మొలువవు.
* పుచ్చుకున్నప్పుడు పుత్రుడు పుట్టినంత సంతోషం, ఇచ్చేటప్పుడు ఇంటాయన పోయినంత దుఃఖం.
* పుచ్చు వంకాయలు, బాపని బయ్యాలు.
* పుట్టంగ పురుడు, పెరగంగ పెళ్ళి.
* పుట్టకు ధ్వనెత్తితే పుట్టెడు, మొగుడికి ధ్యాసెత్తితే పుట్టెడు.
* పుట్టని బిడ్డకు (పిల్లకు) పూసలు కుట్టినట్లు.
* పుట్టపై బాదిన పాము చస్తుందా?
* పుట్టనివాడు, గిట్టనివాడు, గోడబొమ్మలో ఉన్నవాడే (ద్రావిడులలో మహాత్ముడు).
* పుట్టమన్ను ఎరువైతే పుట్లకొద్ది పంట.
* పుట్టమీద తేలుకుట్టినా నాగుబాము కరచినట్లే.
* పుట్టమీద గొట్ట భుజంగంబు చచ్చునా?
* పుట్టలో చేయిపెట్టితే కుట్టక మానుతుందా?
* పుట్టలోని చెదలు పుట్టదా? గిట్టదా?
* పుట్టల్లో తారికాడేది ఎవరంటే అంజీకివచ్చిన అంకడు అన్నాడట (అంజి=గ్రామ సముదాయక కార్యములకు గ్రామస్థులందరు వంతుల ప్రకారం పంపినవారు చేసేపని).
* పుట్టించినవాడు పూరి మేపడా?
* పుట్టిచచ్చినా పుత్రుడే మేలు.

No comments:
Post a Comment