Sunday, July 14, 2019

ప - ఫ >>>> 21

* పుట్టినదానికి పెట్టిందే సాక్షి (పూర్వజన్మలో దానంచేసింది).
* పుట్టిననాటి (పుట్టుకతో వచ్చిన) గుణం పుడకలతో గానీ పోదు.
* పుట్టిననాటి గుణం పులిఆకులలో వేసినా పోదు.
* పుట్టిననాటి పుల్లగాడే మొగుడా?
* పుట్టినప్పుడే గిట్టేవ్రాత వ్రాసినాడు.
* పుట్టిన పిల్లలు బువ్వ కేడిస్తే, అవ్వ మొగుడికేడ్చిందట.
* పుట్టిన బిడ్డ బువ్వకేడిస్తే, కడుపులో బిడ్డ శనగలు కావాలన్నదట.
* పూట్టిన బిడ్డల్లా చచ్చేదానికంటే మగడే చచ్చేది మేలు.
* పుట్టినవాడు గిట్టకపోడు (మానడు).
* పుట్టినవానికి తమ్ముడు, పుట్టేవానికి అన్న.
* పుట్టిని చిట్టితో గొలిచినట్లు.
* పుట్టినిల్లు ఏకాదశి, మెట్టినిల్లు గోకులాష్టమి.
* పుట్టినిల్లు పుణ్యలోకం, మెట్టినిల్లు ఆరళ్ళలోకం.
* పుట్టుకకో గుణము, పుఱ్ఱెకో బుద్ధి.
* పుట్టుకచూస్తే గరుత్మంతుడు, గుణం చూస్తే పీతిరిగద్ద.
* పుట్తుకతో వచ్చిన బుద్ధి పుడకలతోగానీ పోదు.
* పుట్టుచాయే గానీ పెట్టుచాయ వచ్చునా? (నిలుచునా?)
* పుట్టుట గిట్టుటకొఱకే, పెఱుగుట విఱుగుటకొఱకే, ధరతగ్గుట హెచ్చుట కొఱకే.
* పుట్టునత్తా? పెట్టునత్తా? (నత్తి).
* పుట్టు వాసనా? పెట్టు వాసనా?
* పుట్టు శాగలేనిది పెట్టు శాగ ఎం ప్రయోజనం? (శాగ=చేవ)
* పుట్టు శాస్త్రులా? పెట్టుశాస్త్రులా?
* పుట్టెడు అప్పు గడ్డపార మింగినట్లు.
* పుట్టెడు అప్పయినా కాయవచ్చునుగానీ పుప్పి(పిప్పి) మాటలు ఎవడుపడతాడు?
* పుట్టెడు ఆముదము రాసుకొని పొర్లాడినా, అంటేదే అంటుతుంది, అంటంది అంటదు.
* పుట్టెడు నువ్వుల్లో పడ్డా అతికేవే అతుకుతవి.
* పుడుతూ పుత్రులు, పెరుగుతూ శత్రువులు.
* పుడుతూ సోదరులు, పెరుగుతూ దాయాదులు.
* పుణ్యం కలిగిన మగని చేసుకుంటే, పూసలలోనికొక రుబ్బుడురాయి.
* పుణ్యంకొద్ది పురుషుడు, దానం కొద్దీ బిడ్డ.

No comments:

Post a Comment