Sunday, July 14, 2019

ప - ఫ >>>> 22

* పుణ్యంకొద్ది పురుషుడు, విత్తంకొద్దీ వైభవము.
* పుణ్యం పుట్టెడు, పురుగులు తట్టెడు.
* పుణ్యానికంటే మా చిన్నాయనను తోలుకొస్తాను అన్నట్లు.
* పుణ్యానికి పట్టేడిస్తే (పుట్టెడాళ్ళిస్తే) పిచ్చకుంచమని పారబోసినాడట.
* పుణ్యానికి పుట్టినదే సాక్షి, బావికి నీళ్ళే సాక్షి.
* పుణ్యానికి పోతే పాప మెదురు వచ్చిందట.
* పుతపుతల మారెమ్మకు పొడికూడే కానీ గడ్డకూడు రాదు.
* పుత్తికి పురచేయి లోకువైనట్లు.
* పుత్రసంతతిలేని పురుషుని కలిము కలహంసలేని కలనువంటిది.
* పుత్రుడై వేధింతునా? శత్రుడనై వేధింతునా? పేరులేని దెయ్యమునై వేధింతునా?
* పుదుచ్చెరిలో వీధులు సక్రమమే గానీ, బుద్ధులు వక్రం.
* పునర్వసు, పుష్యాలకు పూరేడు అడుగైనా తదవదు (పూరేడు(లు)= కముజు జాతి అడవిపిట్ట).
* పునశ్చరణమే అపవాదానికి పెంపు.
* పునుగు చట్టము పిండినట్లు.
* పున్నమినాటి పురుషుడు, అమావాశ్యనాటి ఆడబడుచు.
* పున్నమ్మ పెళ్ళికి చంద్రుడుదయించినట్లు.
* పున్నానికి పూజ, అమావాశ్య కారగింపు (తేనెతుట్టె).
* పున్నెపుచింతల పులుసు, పొగాకిత్తుల పొగుసు.
* పుబ్బ ఉబ్బిబ్బి కురిసినా గుబ్బచ్చి చెట్టుకింద నానదు.
* పుబ్బ కెరలితే, భూతం కెరలినట్టు.
* పుబ్బ రేగినా బూతు రేగినా నిలువవు.
* పుబ్బలో చల్లేదానికంటే దిబ్బలో చల్లేది మేలు.
* పుబ్బలో చల్లేది మబ్బుతో మొత్తుకొనేది.
* పుబ్బలో పుట్టి, మఖలో మాడినట్లు.
* పుబ్బలో పుట్టెడుకంటే, మఖలో పానెడు మేలు.
* పుబ్బలో పుట్టెడు చల్లే కంటే ఆశ్లేషలలో అడ్డెడు చల్లేది మేలు.
* పురాణంలో ఏమి చెప్పినారే అంటే, అక్కడా నీమొగాననే మొద్దులు బెట్ట (నిప్పులుబోయ) మన్నారన్నదట పెండ్లాము.
* పురాణంలోని వంకాయలు పులుసులోకి రావు.
* పురాణం విన్నప్పుడు పుట్టెడు బుద్ధులు, అవతలపోతే అదవ (అపర) బుద్ధులు.
* పురిటాలికి పుట్టెడైనా చాలదు (ఆకలి ఎక్కువట).

No comments:

Post a Comment