* పూచింది ఒక ఎత్తు, కాచింది మరొక ఎత్తు.
* పూచింది పుడమంత, కాచింది గంపంత.
* పూచిన తంగెడు వేసినా, కాచిన వెంపలి వేసినా, నేను వండుతానన్నదట వరి.
* పూచిన పూలెల్లా కాయలైతే చెట్టు మనునా?
* పూచిన వెన్నెలంటే పుప్పొడి వెదకమన్నట్లు.
* పూచే పూతను బట్టి కాచే కాపుండును.
* పూజకన్నా బుద్ధి, మాట కన్నా మనసు ప్రధానం.
* పూజకొద్ది పురుషుడు, దానంకొద్ది బిడ్డలు.
* పూజకొద్ది బిడ్డలు, అదృష్టం కొద్ది ఆలు.
* పూజ పునస్కారాలు లేక బూజెక్కి ఉన్నానుగానీ, నైవేద్యం పెట్టు నా మహిమ చూపిస్తాను.
* పూజారి బలిసి పోలేరమ్మ చండ్లు పట్టుకొన్నాడట.
* పూటకూళ్ళకు వచ్చిన వాళ్ళకు పుట్లధర ఎందుకు?
* పూటకూళ్ళమ్మ పుణ్య మెఱుగదు.
* పూటకూళ్ళింట పాత్రకు ఎంగిలి లేదు.
* పూట గడుస్తుంది గానీ, మాట నిలిచిపోతుంది.
* పూట బత్తెము -- పుల్ల వెలుగు.
* పూటలు మూడు భోజనం ఒకటి.
* పూడ్చలేనంత గొయ్యి, తీర్చలేనంత అప్పు చెయ్యరాదు.
* పూతకు ముందే పురుగు పట్టినట్లు.
* పూబోడి అంటే ఎవర్రా బోడి? నీ అమ్మ బోడి, నీ అక్క బోడి అన్నదట.
* పూరణంలేని బూరె వీరణంలేని పెండ్లి వ్యర్థము.
* పూరి గుడిసెకు చాందినీ మంచం కావలెనా?
* పుర్ణిమనాడు కొంగుపట్టుక పిలిస్తే రానిది, అమావాశ్యనాడు కన్ను గీటితే వస్తుందా?
* పూర్వజన్మ కృతముల్ కాబోలు ఈ నెయ్యముల్.
* పూర్వోత్తరమీమాంసలకు బాబూ అమ్మగారు వ్యాఖ్యానం వ్రాసినట్లు.
* పూర్వోత్తరా లెరిగి పొత్తు చేసికోవలె.
* పూల చేరెత్తినట్లు.
* పూలతో గూడ నార తలకెక్కినట్లు.
* పూల వాసన నారకు పట్టినట్లు.
* పూలమ్మి బ్రతికిన వారిని పుల్లలమ్మ బిలువరాదు.

No comments:
Post a Comment