* పూవు పుట్టగానే పరిమళం వెదజల్లుతుంది.
* పూవు పుట్టగానే వాసన.
* పూవు లమ్మిన అంగడిలోనే కట్టెలు అమ్మినట్లు.
* పూస, పోగు ఉంటే భుజ మెక్కవలెనా?
* పూసలలో దారమువలె
* పూసుకురావే బూరెముక్కా అంటే, నేనూ వస్తానే నేతిచుక్కా అన్నట్లు.
* పెంటకుప్ప పెరిగితే, పేదరైతు పెద్దవాడగును.
* పెంట తినే బఱ్ఱె, కొమ్ములు కోస్తె మానుతుందా?
* పెంట తినే బఱ్ఱెపాలు పనికిరాకుండా పోతున్నవా?
* పెంటదినెడు కాకి పితరుండెట్లాయె?
* పెంటదినెడు కాకి పెద్ద యేలాగయ్యె?
* పెంటమీద చెట్టు ప్రబలం, నిరుపోసిన చెట్టు నిర్మలం.
* పెంటమీద పంట, మంటమీద వంట.
* పెంటమీద రాయివేస్తె, తనపైనె పడుతుంది.
* పెండ్లాన్ని కొట్టడం ఎప్పుడు మానినావు అని అడిగినట్లు.
* పెండ్లాము కొట్టితే చస్తామనుకుంటె, చావటం అలవాతు లేకపోయెనే అని అఘోరించాడట.
* పెండ్లాము (భార్య) పాలిండ్లు రిక్తకుంభములు, రాయివెలది చనుదోయి పూర్ణకుంభములు (రాయివెలది=వెలయాలి).
* పెండ్లాము బెల్లము, తల్లి దయ్యము.
* పెండ్లి అయిన ఇంటిలో ఆరునెలలు కఱవు.
* పెండ్లికి చేసిన పప్పు, పేరంటాండ్రు చవిచూడను సరిపోయింది.
* పెండ్లికి ముందు బాగా కండ్లు తెరచుకొని చూచి, పెండ్లికాగానే కండ్లు సగం మూసుకొని చూచీ చూడనట్లుండాల.
* పెండ్లికి వచ్చినవాళ్ళంతా పెళ్ళాలేనా?
* పెండ్లికి వెడుతూ పిల్లిని చంకన పెట్టుక వెళ్ళినట్లు.
* ఓండ్లికూతురు పిత్తినట్లు.
* పెండ్లి కొచ్చినమ్మ పెదవు లెండినాయి అంటే, నీ వెన్నడొచ్చినావమ్మ నిలువుకండ్లు పడినాయి అన్నదట.
* పెండ్లి కొచ్చినవారు వారే చేస్తారు, పెండ్లామా! నీ ఒళ్ళు అలిపించుకోకు.
* పెండ్లికొడుకు కుంటి కుడికాలుచూచి అత్త ఏడుస్తుంటె ఏడ్పులో ఏడ్పు ఎడమకాలుగూడా చూపమన్నాడట-తోటిపెండ్లికొడుకు.
* పెండ్లికొడుకు మనవాడేగానీ చెవులపోగులు మాత్రం మనవిగావు.
* పెండ్లినాటి పప్పుకూడు దినమూ రమ్మంటే వస్తుందా?
* పెండ్లినాటి సౌఖ్యం లంఖణాలనాడు తలచుకొన్నట్లు.

No comments:
Post a Comment