* పెట్టిపోయని వట్టి బెరములేల?
* పెట్టిపోసిన నాడే చ్ట్టాల రాకడ, కలిమిగలిగిననాడే వారకాంత వలపు.
* పెట్టుకు ఆయం లేదు, తిట్టుకు సింగారం లేదు.
* పెట్టు చుట్టం, తిట్టు పగ.
* పెట్టు చుట్టము, పొగడ్త సిరి.
* పెట్టుతానంటె ఆశ, తిట్టుతానంటే భయం.
* పెట్టుపోతలు లేని వట్టి కూతలు - పువ్వుపిందె లేని వట్టిచెట్టు.
* పెట్టేమ్మ బుద్ధిలో ఉంటే, ఏ బంతినైనా పెడుతుంది.
* పెట్టేవి రెండు (చివాట్లు) పెందలాడే పెట్టు, దూడ గడ్డికి పోవాలన్నాడట.
* పెడతల దురద పేనుకేమి తెలుసు.
* పెడద్రానికి, పెద్దరోగానికి మందులేదు (పెడద్రం=మొండి పట్టుదల; పెద్దరోగం=కుష్టురోగం).
* పెడమోము బెట్టుట ప్రీతిలేక.
* పెడితే శాపం, ఇస్తే వరం.
* పెత్తనం చేసేవాడు, పెంటి సంతానం కలవాదు అందరికీ లోకువే.
* పెత్తనానికి పోతే దుత్త చేతికివస్తుంది.
* పెత్తర అమావాశ్యకు పెద్దరొట్టె ఇస్తా నన్నాడు (పెత్తర అమావాశ్య=మహాశయ అమావాశ్య).
* పెద్దబావగారు ఆడంగులతో సమానం.
* పెదవికి మించిన పల్లు-ప్రమిదకు మించిన వత్తి.
* పెదవిదాటితే పెన్న దాటుతుంది, పెన్న దాటితే పృథివి దాటుతుంది.
* పెదవిపై మందహాసం, ఎదలో చంద్రహాసం.
* పెద్ద ఇంటి బొట్టె(ట్ట) - ఎద్దులున్న వ్యవసాయం.
* పెద్ద ఇంటి బొడ్డి(ట్టె) అయినా కావాల, పెద్ద చెఱువు అయినా కావాల (బొడ్డి= ఇల్లాలు, స్త్రీ).
* పెద్ద ఇంటి ఱంకు, పెద్దచెఱువు కంపు తెలియవు.
* పెద్ద ఇంటి ఱంకు, పెద్దమనిషి బొంకు తెలియవు.
* పెద్ద కత్తి పెరుమాళ్ళు (మాటలకు అడ్డులేనివాడనుట).
* పెద్దక్క ఓలి తెగితే, చిన్నక్క ఓలి తెగుతుంది. (తెగితే=నిర్ణయమయితే).
* పెద్దకోడలికి పెత్తనమిస్తే ముడ్డి కడుక్కోకుండా (పీతిగుద్దతో) ఇంట్లోకి వచ్చిందట.
* పెద్దచెట్టుకు సుడిగాలి పెనుభూతం వంటిది.
* పెద్దతల లేకుంటే పెద్దరికం చాలదు.
* పెద్దతల లేకపోతే పొట్టేలు (ఎద్దు) తలన్నా తెచ్చి పెట్టుకోమన్నారు.

No comments:
Post a Comment