Sunday, July 14, 2019

ప - ఫ >>>> 29

* పెద్దపులి ఎదుటయినా పడవచ్చునుగాని, నగరివారి ఎదుట పడరాదు.
* పెద్దపులి చాటుకు చేరిన ఎలుకకు, నమిలే గండుపిల్లి నల్లితో సమానం.
* పెద్దపులి తరుముకువచ్చినా కంసాలి అంగడిలోకి పోరాదు (దూరరాదు).
* పెద్దపులి తరిమినా, దేవిడిముందుకు పోరాదు.
* పెద్దపులి పేరంటం పెట్టునా?
* పెద్దపులిమీద స్వారీ చేసేవాడు భూమిమీద నడవలేడు అన్నట్లు.
* పెద్దమనిషిని పేరంటానికి పిలిస్తే అర్థసేరు పసుపు ముడ్డికే సరిపెట్టినాడంట.
* పెద్దమనిషి, ప్రజాపతి పనికిముందు విజృంభించి పనికాగానే శాంతిస్తారు.
* పెద్దముత్తైదువు సద్దుచేయదు, చిన్నపిల్లే చిందులుతొక్కేది.
* పెద్దమ్మా! నీవెక్కడికంటే, చిన్నమ్మా నీవెనుకే ఉంటానన్నదట.
* పెద్దరికానికి పెద్దబావ చస్తే, ఇంటిల్లిపాది ఈడ్వలేక చచ్చిందట.
* పెద్దరెడ్డి కొంగు పట్టుకుంటే, కాదనేదెట్లా? అన్నదట.
* పెద్దల ఉసురు పెనుబామై తగులును.
* పెద్దలకు పెట్టరా పేచీల తలపాగ.
* పెద్దలతో వాదు, పితరులతో పోరు.
* పెద్దలమాట చద్దిమూట.
* పెద్దలమాట పెన్నిధిమూత.
* పెద్దలమాట పెఱుగుకూటి మూట.
* పెద్దలు లేని ఇల్లు, ఎద్దుల కొటిక.
* పెద్దలు లేని ఇల్లు, సిద్ధులులేని మఠము.
* పెద్దలేకపోతే గొఱ్ఱె (దున్నపోతు) తలనైనా తెచ్చుకోమన్నారు.
* పెద్దలేని ఊరుకి పోతురాజే పెద్ద.
* పెద్దవాన పెళపెలా పడితే, చిన్నవాన నానుడు పడుతుంది.
* పెద్దుభోట్లూ, పెద్దుభోట్లూ! సన్యాసంతీసుకుంటావా? అంటే, పెండ్లాము చెప్పుతో మాడున కొడితే తీసుకోక తప్పుతుందా? అన్నాడట.
* పెనములోనుంచి పొయ్యిలో పడినట్లు.
* పెన మే మెఱుగును పెసరట్టు రుచి.
* పెనుగాలికి, కాచినమాను వెరచునుగానీ పెనుమొద్దు వెరచునా?
* పెనుగొండకు పిల్లనివ్వరాదు, రోద్దానికి ఎద్దునివ్వరాదు (రోద్దం=అనంతపురం జిల్లాలో ఒక ఊరు).
* పెను రంకుబోతు కూతురుతో బాటు దుందుడుకు కొడుకు బుట్టినట్లు.
* పెన్న దాటితే పెరుమాళ్ళ సేవ.

No comments:

Post a Comment