Sunday, July 14, 2019

ప - ఫ >>>> 30

* పెన్నరావడం వెన్న కరిగే లోపలనె.
* పెన్నలో మాన్యం కాశీలో దానం చేసినట్లు.
* పెన్నీరు జిల (గిల)క్కొట్టి వెన్న దీసినట్లు, ఆకాశాన్ని పిడికిట బట్టినట్లు.
* పెమ్మకట్లవారి మంత్రం దెబ్బ అంటే, కమ్మకట్ల పాముకాటైనా పోతుంది.
* పెయ్యను కాపాడమని (కాచమని) పెద్దపులికి అప్పచెప్పినట్లు.
* పెయ్యను పెంచితే పేదరికంలేదు.
* పెరటికి పోయినవానిని తన్నలేక పెంటను తన్నినట్లు.
* పెరటిచెట్టు ముందుకు రాదు.
* పెరుగగా పెరుగగా పెదబావగారు కోతి అయినట్లు.
* పెరుగగా పెరుగగా పెదబావ గుఱ్ఱం గాడిదయినట్లు అయునాడట.
* పెరుమాళ్ళకైనా పెట్టువాడే చుట్టం.
* పెఱుగుట విఱుగుట కొఱకే, ధర తగ్గుట హెచ్చుట కొరకే.
* పెఱుగుకు పులికడుగుకు పెనకువ అయినట్లు.
* పెఱుగు పెత్తనం చెఱచును.
* పెఱుగూ వడ్లు కలిపినట్లు.
* పెళ్ళాం పోతే పెళ్ళికొడుకు అయినట్లు.
* పెళ్ళాం బెల్లం ముక్క, తల్లి మట్టిబె(గ)డ్డ.
* పెళ్ళి కెళ్ళిన యింటిన వలసవెళ్ళ బుద్ధయినదట.
* పెళ్ళికిపోతూ పిల్లిని చంకలో బెట్టుకొని పోయినట్లు.
* పెళ్ళికిముందు కండ్లు బాగా తెరచుకొని ఉండి, పెండ్లికాగానే సగం మూసుకోవాల.
* పెళ్ళే బాగుంది, పప్పువండితే మరీ బాగుంటుంది.
* పెసరకు పైరుగాలి, పసరానికి నోటిగాలి ప్రమాదం (పైరు(ర)గాలి=దక్షిణపు గాలి; నోటిగాలి= పశువులనోటికి తగులు పుండ్లవ్యాధి).
* పేగు చుట్టమా? పెట్టు చుట్టమా?
* పేచీకి పెదబాబు.
* పేడకుప్పకు దిష్టి (దృష్టి) దీయాలనా?
* పేడదిన్న పురుగు బెల్లమే మెరుగురా.
* పేడలో పొదిగిన ఉల్లిగడ్డవలె.
* పేడా, బెల్లం ఒకటి చేసినట్లు.
* పేడు ముదిరి పెండ్లికొడుకగు.
* పేద కడుపు నింపను అన్నం వెదకును, మహారాజు అన్నం నింపను కడుపు వెదకును.

No comments:

Post a Comment