Saturday, July 13, 2019

ద - ధ >>>> 2

* దప్పికి నీళ్ళీక తరిమి నాతడు ఇష్టన్న మివ్వగలడా?
* దబ్బుర పాటకు తలత్రిప్పుటలు మెండు.
* దమ్మున్న దాడి పొమ్మన్న పోదు
* దమ్మిడీ ఆదాయం లేదు, క్షణం తీరిక లేదు.
* దమ్మిడీ కల్లుకు 9తాగి) ఊరంతా గెంతులు.
* దమ్మిడీ పెళ్ళికి ఏగాని భోగం మేళం.
* దమ్మిడీ పెళ్ళికి రూపాయి బాణాసంచా.
* దమ్మిడీ ముండకి ఏగాణి క్షవరం.
* దయగల దేవరా! నామగని వెదకి వానిని పట్టు, నన్ను పట్టకు.
* దయగల మొగుడు దండుకుపోతూ, రోలుతీసి రొమ్మున వేళాడవేసి పోయాడట.
* దయతలచి దాహ మిస్తే, ఊళ్ళోకెళ్ళి ఉడుకు అన్నట్లు.
* దయ తుఱ్ఱుమంటే, నెత్తి చుఱ్ఱుమంటుంది.
* దయతో దండాలు పెడితే, పడవేసి బందాలు పెట్టినట్లు.
* దయ దండిది, గుణం మొండిది.
* దయలేని అత్తకు దండం పెట్టినా తప్పే, ఊరకున్నా తప్పే.
* దయ్యం బెదిరికి వరమిచ్చు.
* ద్వయపు కంతికి పేలగింజ పెద్ద.
* దయ్యము కొట్టనూ, బిడ్డ బ్రతకనూనా?
* దయ్యము పట్టినప్పుడే చెప్పుతో కొట్టాలి.
* దయ్యాలతో నెయ్యాలు చేసినట్లు.
* దయ్యాల ముందర బిడ్డలు బ్రతుకుతారా?
* దరిద్రాన్నయినా ఏడేండ్లు దాచిపెట్టితే అక్కరకు రావచ్చు.
* దరిద్రానికి దైవ కొండాటకం.
* దరిద్రానికి మాట లెచ్చు, తద్దినానికి కూర లెచ్చు.
* దరిద్రుడికి ఏరేవు వెళ్ళినా ముళ్ళపరిగే.
* దరిద్రుడికి పిల్లలెక్కువ.
* దరిద్రుడికి సద్ది కట్టి ఇస్తే, ఊరివెలుపల కుంటకాడనే భోంచేసి పోయినాడట.
* దరిద్రుడి చేనికి వడగండ్ల వాన.
* దరిద్రుడీ సంగీతానికి భూమ్యాకాశాలే తాళపు చిప్పలు.
* దరిద్రుడు తల కడుగబోతే వడగండ్ల వాన వచ్చిందట (కురిసిందట).

No comments:

Post a Comment