Saturday, July 13, 2019

ద - ధ >>>> 3

* దరిద్రునికి దైవమే తోడు.
* దరిలేని బావి, వితరణలేని ఈవి.
* దర్శనంబులారు దైవంబు ఒకటి.
* దర్శనంబులు వేరు దైవమౌనొకటి.
* దర్జీవానిని చూస్తే సాలెవానికి కోపం.
* దలారికి దండుగ భయం - మశీదుకు దొంగ భయం లేదు.
* దలాలుకోరు వాడు కందూరు చేస్తే తిన్నవరకు నమ్మకం ఉండదు. (దలాలు కోరు= మాట నమ్మిక లేని వాడు, కందూరు= ఉరుసు).
* దశకొద్దీ దొరికాడు దిసమొల మొగుడు.
* దశకొద్దీ దొరికాడు పుసికళ్ళ మొగుడు.
* దశకొద్దీ మొగుడు, దానం కొద్దీ బిడ్డలు.
* దశ దానాలకు తోటకూర కట్ట (మట్ట).
* దశవస్తే దిశ కుదురుతుంది (వాస్తు).
* దశా! దశా! రావే అంటే దరిద్రాన్ని పిలవ మన్నదట.
* దవడ రేగినా దబ్బర రేగినా నిలవవు.
* దక్షిణపు కొమ్ము హెచ్చు ఐతే ధాన్యపు ధర హెచ్చు, ఉత్తరపు కొమ్ము హెచ్చు అయితే ఉప్పుధర హెచ్చు (నెలవంకకు).
* దాగబోయి, తలారి ఇంట్లో దూరినట్లు.
* దాగబోయి తలారి ఎదుట దూకిట్లు.
* దాగబోయిన చోట దెయ్యాలు పట్టుకొన్నట్లు.
* దాచినాను మగడా! వేరుండ మన్నట్లు.
* దాడిగుఱ్ఱం మాదిరి దౌడి తీసి దడిలో దూరినాడట.
* దాణాకు నోరు తెరిచి, కళ్ళానికి (కళ్ళెమునకు) నోరు మూసినట్లు.
* దాణాకొద్ది లద్ది
* దాణా దండుగే గానీ, దమ్మిడీ పనికాదు.
* దాతలిచ్చిన పాలుకంటే, ధరణి (ధారుణి) ఇచ్చిన పాలు మేలు.
* దాతలు లేక కాదు మాకు వ్రాత లేక.
* దాత లేని ఊరు దెయ్యాల పేటరా.
* దాది ఱొమ్ము దూది పాంపుగ.
* దానం చేయకున్నా, దక్షిణం తలజేసి పండాలి.
* దానం చేయ్యని చేయి- కాయలు గాయని చెట్టు.
* దానము చేసిన ఆవుకు దవడపళ్ళు ఎంచబోకు.

No comments:

Post a Comment