Saturday, July 13, 2019

న >>>> 3

* నట్టేటిలో పడ్డ సొమ్ము నట్టింటికి వచ్చినట్లు.
* నడిచే కొద్ది డొంక, పెట్టే కొద్ది కుదురు.
* నడిచే దారిలో గడ్డి మొలవదు.
* నడిచేవాడే పడేది.
* నడమంత్రపు దాసరి పొద్దుమాన మెరుగడు.
* నడమంత్రపు వైష్ణవానికి నామాలు మెండు.
* నడమంత్రపు సిరికి నెత్తిమీద కండ్లు.
* నడమంత్రపు సిరి, నరంమీది పుండు భరింపరానివి.
* నడమంత్రాన సిరివస్తే, నడిరేయి గొడుగు పట్టమన్నాడట.
* నడవంగా నడవంగా పైగుడ్డే బరువైనట్లు.
* నడవడికలు చక్కబెట్టేది నాటకము.
* నడవలేనమ్మకు నాలుగు పక్కలా సవారి.
* నడిస్తే మార్గాయాసం, తింటే భుక్తాయాసం- తిమ్మావధానికి.
* నడుమ దిరిగే కుంటెనగాడికి చెన్నపట్నం రైలుబండి.
* నడుమ దిరిగే కుంటెనగాడికి  కందూరు, కఫాయి (కైపు) సార.
* నడుము మినిగేదాకానే చలి - నలుగురు వినేదాకానే సిగ్గు.
* నత్తగుల్లలన్నీ ఒక రేవున, ముత్యపుచిప్పలన్నీ ఒక రేవున (చేరును).
* నత్తగుల్లలో ముత్యాలు పుట్టునా?
* నత్తి నాలిగింటి కర్ధం.
* నది నాల్గామడ ఉండగా, చీరవిప్పి చేతపట్టు కున్నదట.
* ననకూడి నార తలకెక్కినట్లు.
* నన్ను ఎఱిగినవాడు లేకపోతే, నా బడాయి చూడమన్నట్లు.
* నన్ను కొడితే కొట్టావుగానీ, మా బావను కొట్టు చూస్తాం అన్నట్లు.
* నన్ను చూస్తే, నిన్ను కాస్తా.
* నన్ను నేనే ఎఱుగను, నేను నిన్నేమి ఎఱుగుదును?
* నన్ను పెంచితే, నిన్ను ముంచుతా.
* నన్ను ముట్టుకోకు నా మాల కాకి.
* నపుంసకుని చెంతనా నవలా సరసం?
* నపుంసకుని చేతికి రంభ దొరికినట్లు.
* నమలక, మింగక నానవేసినట్లు.

No comments:

Post a Comment