Sunday, July 14, 2019

ల >>>> 2

* లంజ మెత్తనైతే, పోతూ పినతండ్రిని లేవగొట్టి పోయినాడట.
* లంజల కలువాయి, రంకుల కుల్లూరు మధ్య, తయిదిపాటి రెడ్లొచ్చి తగువులు తీర్చినారట.
* లంజ లగ్గం (లగ్నం) చెరిస్తే, మాలెత (మాలది) మగ్గం చెరచిందట.
* లంజ లజ్జుండి (లజ్జ ఉండి) చెడితే, ఆలు లజ్జ లేక చెడుతుంది.
* లంజ లేకపోతే గుడి రంజిల్లదు, ప్రజల మనసు రంజిల్లదు. (లంజ=దేవదాసి, గుడిచేటి).
* లంజా ! అంటే లక్ష్మీదేవి అన్నట్లగునా? (లంజ లం = నీటియందు, జ = పుట్టినది - లక్ష్మి అని).
* లంజ కుచాలింగనాలకంటే లికుచాపాదతాడనం మేలు.
* లక్క జొచ్చిన నగ - కుక్క జొచ్చిన ఇల్లు.
* లక్కలేని నగ, బొక్కలేని మాంసం.
* లక్కవంటి తల్లి, ఱాయివంటి బిడ్డ.
* లగ్గ పగ్గం పెట్టు చిక్కింది.
* లగ్గ మంటే పగ్గ మన్నట్లు.
* లగ్నంలో తుమ్మినట్లు.
* లచ్చ ఉంటే కోటి లక్షణాలు.
* లచ్చి గాజులకు సంతకు చీటీ వ్రాసినట్లు.
* లాడాయి వచ్చినప్పుడా కత్తులు చేసికోవడం?
* లద్దిలో మాణిక్యం (దొరికినట్లు).
* లక్షణం చెడితే అవలక్షణం.
* లక్షణం పలుకరా పెండ్లికొడుకా ! అంటే అయిరేని కుండ పదహారు వక్కలు అన్నట్లు (అయిరేని=అరివేణి).
* లక్షణాలుగల బావగారికి రాగి మీసాలు, అవలక్షణాలు గల బావగారికి అవీలేవు.
* లక్ష నక్షత్రాలైనా ఒక చంద్రుడుగాడు.
* లక్షబుద్ధులు చెప్పినా, లంజబుద్ధి మానదు (మారదు).
* లక్ష్యభక్ష్యాలు భక్షించే కుక్షికి ఒక భక్ష్యం లక్ష్యమా?
* లాకు ఏత్వము, దాకు కొమ్ము - అననివాడు (లేదు అనుట).
* లాడం దొరకగానే గుఱ్ఱం దొరికినట్లా?
* లాభం గూబలలోకి వచ్చింది.
* లాభంలేని శెట్టి వరదకు పోడు.
* లావుమీద వంపు తెలియదు.
* లావు లేని చేను - లేగ లేని ఆవు.
* లింగధారికన్న దొంగలు లేరయా.

No comments:

Post a Comment