Sunday, July 14, 2019

ప - ఫ >>>> 31

* పేదకు తగిలే బ్రహ్మహత్య అన్నట్లు.
* పేదకు పెన్నిధి దొరికినట్లు.
* పేదపేద గూడి పెనగొనియుందురు.
* పేదతెవులు అంగడి బెట్టకున్న తీరదు.
* పేదబడ్డవెనుక పెండ్లము మతిచూడు.
* పేదలకు చేతనయినది కలలు గనుట మాత్రమే.
* పేదల కోపం పెదవికి చేటు.
* పేదల బిగువు, సాధుల తగవు.
* పేదయింటగానీ రాచయింటగానీ ఎద్దు తినేది గడ్డే.
* పేదవాడు పెంత తింటే ఆకలికని, మారాజు తింటే మందుకని.
* పేదవాణ్ణి చూస్తే పేలాలు త్రుళ్ళుతాయి.
* పేదవానికి పెండ్లామే ఆస్తి.
* పేదవాని యింట పెండ్లయిన ఎరుగరు.
* పేదవానికి పెండ్లామే లంజ.
* పేదవాని పెళ్ళాం వాడకెల్ల వదిన.
* పేదవానిపైనే పడెరా పెద్దపిడుగు.
* పేదవానివెంట పడెనమ్మా జోరీగ.
* పేదవాని స్నేహం, మహారాజువిరోధం సహింపరానివి.
* పేను కుక్కమంటే చెవి కరచినట్లు.
* పేనుకు పెత్తనమిస్తే, ఈపిని యిరవైచోట్ల యీనిందట.
* పేనుకు పెత్తనమిస్తే, తలంతా తెగకొరికి పెట్టిందట.
* పేనేమెఱుగును పెడతల కండూతి?
* పేరంటానికి వచ్చి, పెండ్లికొడుకు వరస ఏమన్నట్లు.
* పేరంట్రాండ్లు పదిమందిచేరి పాకం చెడగొట్టినట్లు.
* పేరితే పాలే పెరుగు.
* పేరిశాస్త్రికి కలిగెరా పెదవిపాటు.
* పేరు ఒకరిది, పెత్తనం ఇంకొకరిది.
* పేరు ఒకరిది, నోరు ఇంకొకరిది.
* పేరు కమలాక్షి, కండ్లేమో చీపురివి.
* పేరు కమలాక్షి, చూపులు కాకి చూపులు.

No comments:

Post a Comment