Sunday, July 14, 2019

ప - ఫ >>>> 32

* పేరుకు మోపూరు, పెనులోభులు వారు.
* పేరు గంగాభవాని, తాగబోతే నీటిచుక్క లేదు.
* పేరు గురులింగ మంటే, ఉండే మూడులింగాలు (పురుషాది) గాక ఇదెక్కడ దన్నాడట.
* పేరు జీలకఱ్ఱ, చూడబోతే కఱ్ఱ లేదు.
* పేరు ధర్మరాజు, పెనువేప విత్తయా.
* ేరు పెండ్లివాండ్లది, తిండి ఇంటివాండ్లది.
* ేరు పెత్తనం చెఱచును.
* ేరు గొప్ప ఊరు దిబ్బ.
* ేరు పెద్దఱింకం, చెప్పులమోత.
* ేరు పెనిమిటిది, అనుభవం మామ గారిది (ఊరివారిది).
* ేరు పెన్న మోసినది, ఒళ్ళు నేల మోసినది.
* ేరు పెరుమాళ్ళది, నోరు తనది (పేరంటాలిది).
* ేరు పేరయ్యది, పిల్ల ఉమ్మడిది.
* ేరు నేతిబీరకాయ, చీరిచూస్తే నేతిచుక్క లేదు.
* పేరులేని వ్యాధికి పెన్నేరుగడ్డ మందు.
* పేలాలు చల్లి దెయ్యల లేపినట్లు.
* పేలికైనా పిండి కట్టమన్నారు.
* పైఆకు రాలితే, కిందిఆకు పైకి వచ్చినట్లు.
* పైకం భాగవతం వారికి, తిట్లు చాకలి మంగలివాళ్ళకు.
* పైచట్టంలో పరమాన్నం, పాపరా నన్ను లేపరా అన్నట్లు.
* పైచాలు లేని పైరు, ఏగలి అంబలి లేని మనిషి.
* పైడికొండలో బచ్చు (బొచ్చు) బేరాలా?
* పైతళ్ళుక్కయితే పడరానిపాట్లు పడవచ్చును గానీ, మొగం ముడతలుపడితే చేసే దేమున్నది?
* పైత్యం లేదు, శైత్యం లేదు, పచ్చడంబట్ట ఇటు పారవేయండి.
* పైత్యరోగికి పంచదార చేదు.
* పైన పండ్లు, లోపల పుచ్చుకొమ్మ చెట్టు (దుష్టుడు).
* పైన పటారం, లోన లొటారం.
* పైన పడ్డ మాట, మడిని పడ్డ నీరు.
* పైన పోయే పక్షియీకలు ఎన్ని అన్నట్లు.
* పైన మంట, కింద మంట, కడుపులో మంత, కాలు నిలిపితే ఖామందు తంట.

No comments:

Post a Comment