Saturday, July 13, 2019

క - ఖ >>>> 33

* కొఱివి పెట్టెవాడు కొడుకు, కూడుపెట్టేది కూతురు.
* కొఱ్ఱకు నక్క కొఱ్ఱ.
* కొఱ్ఱగింజంత కోడలిని చూస్తే కొండంత జ్వరం వచ్చిందట.
* కొఱ్ఱల సేవ్యం (సేద్యం) కూటికైనా రాదు.
* కొఱ్ఱు ఇంటికంబమగునా?
* కొలని హంసలకడ కొక్కెరలుండునా?
* కొలిమి వీధిలో సూదులమ్మినట్లు.
* కొలుచు దంచుట పొట్టకొరకా? (కొలుచు=ధాన్యము).
* కొలువు కన్నా గోపాలనే నయం.
* కొల్లకు పోయి పైచీర కోల్పోయినట్లు.
* కొల్లు మునిగిన కొన్నాళ్ళకు కోనా మునుగుతుంది.
* కొల్లేటి పంట కూటికే చాలదు.
* కొల్లేటి బ్రహ్మహత్య కాపు మీదుగా కొట్టుకపోయినట్లు.
* కొల్లేటిలో పండే పంట పంటలో లెక్కేకానీ, చచ్చే దున్నపోతులకు లెక్కేలేదు.
* కొల్లేటి వ్యవసాయానికి కోతకూలి దండుగ.
* కొల్లేటి వ్యవసాయం గొడ్ల వినాశం.
* కొవ్విన ఎండ్రకాయ కలుగులో నిలువనట్లు.
* కొసరిన కూరలోగానీ పస ఉండదు.
* "కో" అంటే కోటిమంది.
* కోకకు పెట్టిన గంజి కూడి రాదు.
* కోకడాపుతో కోరికలీడేరేనా?
* కోకలు వెయ్యున్నా కట్టుకొనుట ఒకటే.
* కోటగోడల ఇల్లు, తాటాకుల పందిరి.
* కోటచక్కదనము గమిడి చెప్పినట్లు.
* కోటలో పాగా వేసినట్లు.
* కోటవరకు, ఏటివరకు సాగనంపవలె.
* కోటికి పడగలెత్తినవాణ్ణి పదివేల కాపవై బ్రతుకమన్నట్లు.
* కోటికి లాగితే బిళ్ళకు, బిళ్ళకు లాగితే కోటికి.
* కోటిపల్లి గుళ్ళు ఎవరు కట్టించారో తెలియదుకానీ, అంతర్వేది గుళ్ళు నేను కట్టించలేదు అన్నాడట.
* కోటివిద్యల కంటే కోరుకు పొలం దున్నటం మేలు.

No comments:

Post a Comment