Sunday, July 14, 2019

ప - ఫ >>>> 34

* పొట్టి తోకగల కోడె పొడిచినా నడవదు (కదలదు).
* పొట్టిదాని గట్టిదనం పట్టెమంచం ఎక్కినప్పుడు చూడు.
* పొట్టి పోతరాజు కొలువువలె.
* పొట్టివానికి పుట్టెడు బుద్ధులు.
* పొట్టివానికి మితిలేని పొలతి వాంఛ.
* పొట్టివాని నెత్తి పొడుగువాడు కొట్టె, పొడుగువాని నెత్తి దేవుడు కొట్టె.
* పొట్లకాయకు రాయికడితే చక్కనగును గానీ, కుక్కతోకకు గడితే ఫలమేమి?
* పొట్లపాదికి పొరుగు గిట్టదు.
* పొడుగు గాలికి చేటు, పొట్టి నీటికి చేటు.
* పొడు మెక్కించే ముక్కు, పొగపీల్చే నోరు శుభ్రంగా ఉండవు.
* పొడువలేని బంటు చేతిది ఈటైతే నేమి? తెడ్డైతే నేమి?
* పొడవులకు (పరువుకు) రోకలి మింగితే, పొన్నొచ్చి (పన్ను) ముడ్డిన యిరుక్కునదిట.
* పొత్తుకు మళయాళం, సంభందానికి సాంబారు (తమిళుడు ఆంధ్రుని గోంగూర అన్నట్లు).
* పొత్తుమాట పొసగని మాట.
* పొత్తుల పనిలో పిత్తుక చచ్చినట్లు.
* పొత్తుల మగడు పుచ్చి చచ్చెను.
* పొదుగు కోసి పాలు తాగినట్లు.
* పొదుగు చింపిన పసరం పోతు నీనుతుందా?
* పొదుగులేని ఆవు పాలిస్తుంటే, నాలికలేని పిల్లి నాకేసిందట.
* పొదుగులో ఉన్నా ఒక్కటే, దుత్తలో ఉన్నా ఒక్కటె (పాలు) అన్నట్లు.
* పొదుగెంత జారినా కుక్క గోవు కాదు.
* పొద్దుకలుగ (ప్రొద్దుండగా) లేచినందుకు, బాట తప్పినందుకు సరిపోయింది.
* పొద్దుగాని పొద్దులో పెద్దిగాని పెళ్ళి.
* పొద్దు పోదు, నిద్ర రాదు, పద్మాక్షీ! ఒక్క పాటైనా పాడవే అన్నట్లు.
* పొద్దుట లేవని కాపుకి పొలం ఇచ్చేది గడ్డే.
* పొద్దుటిది పొట్టకు, మాపటిది బట్టకు.
* పొద్దు తిరుగుడు, డొంక తిరుగుడు.
* పొద్దుతిరుగు పువ్వు బుద్ధికి, పొద్దుకు నిలకడ లేదు.
* పొద్దుపొడుపున వచ్చిన వాన, పొద్దుగూకి వచ్చిన చుట్టం పోరు.
* పొద్దేమో గడచిపోతుందిగానీ, మాట మాత్రం నిలచిపోతుంది.

No comments:

Post a Comment