Sunday, July 14, 2019

ప - ఫ >>>> 35

* పొమ్మనలేక పొగ బెట్టినట్లు.
* పొయింది పోగా, పిడకల కుచ్చెల బట్టుకొని ఏడ్చినట్లు.
* పొయ్యలు చెడ్డదినంలో వేయాలి, పెండ్లిండ్లు మంచిదినంలో చేయాలి.
* పొయి అరిస్తే బంధువుల రాక - కుక్క అరిస్తే కఱవు రాక.
* పొయ్యి ఊదమంటే కుండ బద్దలు కొట్టాడట.
* పొయ్యి ఊదలేనమ్మ ఏడుమనువులు పోయిందట.
* పొయ్యి ఊదినమ్మకు బొక్కెడు .... బూడిద.
* పొయ్యిప్రక్క కెన్నముద్ద వలె.
* పొయ్యిలో పిల్లి ఇంకా లేవలేదు (వంటను ప్రారంభించను వసతి లేకుండుట).
* పొయ్యి సెగ పొంతకుండకు తగలకపోదు.
* పొరుగమ్మ సరిపెట్టుకుంటే, ఇరుగమ్మ ఉరిపెట్టుకుందట.
* పొరుగింట చూడరా నా పెద్దచెయ్యి.
* పొరుగింటి అట్లకు తిమ్మనం కాచుకుందట.
* పొరుగింటి అట్లకు నెయ్యి కాచినట్లు.
* పొరుగింటి కలహం విన వేడుక.
* పొరుగింటి నెయ్యి, పెండ్లాము చెయ్యి (వడ్డించేటప్పుడు).
* పొరుగింటి పొయ్యి  మండుతున్నదని తన పొయ్యిలో నీళ్ళు పోసుకుకొన్నట్లు.
* పొరుగింటి బాన(బానెడు) పాడి కంటే తనైంటి గిద్ద (గిద్దెడు) పాడి మేలు.
* పొరుగింటి బిడ్డను దింఛి, నీటిలోతును చూచినట్లు.
* పొరుగుది అట్లు పోసితే, ఇంటిది పోరెలు పోస్తుంది.
* పొరుగూరును నమ్ముకోగాక (బాక) పొద్దుమునగ పండుకోబాక.
* పొరుగూరికి పోతే పోతుందా పాపం?
* పొరుగూరు చాకిరి, పొరుగూరి వ్యవసాయం, తనను తినేవే గానీ, తాను తినేవి కావు.
* పొరుగూరు పోగానే పోవునా దుర్దశ?
* పొర్లించి, పొర్లించి కొట్టినా, మీసాలకు మన్ను కాలేదు అన్నాడట.

No comments:

Post a Comment