Saturday, July 13, 2019

క - ఖ >>>> 35

* కోడిని కోసి, గోత్రానికంతా పగ ఐనట్లు.
* కోడిని కోసే ఇంట్లో కొరకొర తప్పదు.
* కోడిని తిట్టిన తిట్టు కోడలి కెఱుక.
* కోడిపిల్లకు గొఱ్ఱెపిల్లను బలాదూరు (దిష్టి) తీసినట్లు.
* కోడిపెట్ట ఎక్కడున్నా మనసు గుడ్లమీదే.
* కోడి ఱెక్కారవేస్తే గొప్పవాన కురుస్తుంది.
* కోడు ఒకడు తీస్తే, కొమ్ము ఒకడు తీస్తాడు.
* కోడెల పోట్లాట మధ్య లేగల కాళ్ళు విరిగినట్లు.
* కోతల కాలంలో ఎలకన్నకు ఏడుపెళ్ళాలుంటే మాత్రం ఏమీ?
* కోడెలు కోడెలు పోట్లాడి, దూడల కాళ్ళు విరగకొట్టినట్లు.
* కోతలకు ఉత్తరకుమారుడు.
* కోతలున్నన్నాళ్ళూ కోతీ బతికింది, తరువాత బతికిందే బతుకు.
* కోతల్లో కునికిపాట్లు పడి, కొత్త అమావాశ్యకు కొంపగోడి అనుకున్నట్లు.
* కోతల్లో కూడదీసుకుంటే, కూటికి కొరత ఉండదు.
* కోతికి అద్దం చూపినట్లు.
* కోతికి కల్లు తాగించినట్లు.
* కోతికి టెంకాయ దొరికినట్లు.
* కోతి చస్తే గోడవతల పారేసినట్లు.
* కోతికి తేలు కుట్టినట్లు.
* కోతికి జల్తారు కులాయి పెట్టినట్లు.
* కోతికి పుండైతే, గోకా, నాకా.
* కోతికి పెత్తనమిస్తే, గోదావరి కడ్డంగా ఈదిందట.
* కోతికి పెత్తనమిస్తే, తలంతా చెడ గొరిగిందట.
* కోతికి బెల్లం చూపరాదు, కోమటికి ధనం చూపరాదు.
* కోతి గెంతడం, సాయబు సంపాదించడం.
* కోతిగుంపుల పాడు కొడవలూరు.
* కోతి చావు, కోమటి ఱంకు.
* కోతిచేతి పాము వలె.
* కోతిచేతి పూలదండ.
* కోతి టెంకాయ తుంచగలదు కానీ నీరు తాగగలదా?

No comments:

Post a Comment