Saturday, July 13, 2019

క - ఖ >>>> 36

* కోతి పంచాయతి కొంపలారుస్తుంది.
* కోతి పిల్లలకు రొట్టె పంచినట్లు.
* కోతిపుండు బ్రహ్మండమైనట్లు.
* కోతిపుండు బ్రహ్మరాక్షసి అయినట్లు.
* కోతి పులి కాదు, కోమటి దొర కాడు.
* కోతిముండకైనా గీత బాగుండవలె.
* కోపం గొప్పకు ముప్పు, అల్లరికి హంగు ముప్పు.
* కోపం పాపమునకు పొత్తు.
* కోపం పొంగు క్రుంగు కొన్నాళ్ళే.
* కోపం రాను కారం తిన్నట్లు.
* కోపము ఎదుటు గొప్పగొద్దు లెరుగదు.
* కోపానికి పోయిన ముక్కు శాంతానికి రాదు.
* కోమటి ఇల్లు కాలినట్లు.
* కోమటి ఏవేళా క్షేమామే కోరును, ధరణీపతి ధనము కోరు.
* కోమటికి, కోతికి ముల్లెచూపరాదు.
* కోమటితో మాట, కోతితో సయ్యాట.
* కోమటిని చూచి నక్క శొంఠి అడిగిందట.
* కోమటి భక్తుడు కాడు, తగరం కత్తి కాదు.
* కోమటి లేమి, కంసాలి కలిమి ఉండవు.
* కోమటి సాక్ష్యం, బాపన వ్యవసాయం.
* కోమటి వైష్ణవము, ఉప్పర సన్యాసము.
* కోమట్ల కోట్లాట, గోచీల ఊగులాట.
* కోమలి విశ్వాసము పాములతో చెలిమి వంటిది.
* కోరి అడిగితే కొమ్మెక్కుతారు.
* కోరికలు కొండలెక్కుతుంటే అదృష్టాలు అడుగంటుతుంటవి.
* కోరికోరి బావతో పోతే కుంటివాడు పుట్టాడట.
* కోరినంత పెట్టెనమ్మా కోతికి శివుడు.
* కోరి పిల్ల ఇస్తామంటే, కులం తక్కువ అన్నట్లు.
* కోరి, వీగీ కొడుకును కంటే, మూగ చెవుడు ముంచుకు వచ్చినవట.
* కోరుకున్న కోడలు వస్తే కొప్పులో చెప్పు పెడుతుంది.

No comments:

Post a Comment