Sunday, July 14, 2019

ప - ఫ >>>> 36

* పొలములోని ఆబోతును పులి గొన్నట్లు.
* పొల్లు కట్ట దంచి పోగుచేసుకొన్నట్లు (పొల్లు= తరగలు, గల్ల).
* పొల్లు దంచిన బియ్యము, తెల్లని కాకి లేవు.
* పోకముడి విప్పుతూ, కోక వెల అడిగినట్లు.
* పోకల కుండ చట్రాతి మీద పగుల కొట్టినట్లు.
* పోకలు నమలుచు ఆకులు చేబూని సున్న మడుగువాడు శుద్ధవెధవ.
* పోకిరికి పోలీసు, చదువురానివానికి సర్వే.
* పోగాపోగా పైబట్ట బరువవుతుంది.
* పోచమ్మకు, కందూరు పీర్లకు బోనాలు (బోనాలు=అన్నము, పొంగలి)
* పోట్లడే కోళ్ళు పొడిచినా పోవు.
* పొడమిగలనాడే పొరుగింటి పొందు (పొడిమి=సంపద).
* పోతా, పోతా అన్నోళ్ళకు పోకడ లేదు, చస్తా, చస్తా అన్నోళ్ళకు చావు లేదు.
* పోతురాజు ఇష్టమా? పొట్టేలు ఇష్టమా? (కోయుటకు)
* పోతూ పారవేస్తూ పోయి, వస్తూ ఏరకతినే (ఏరుకొనే) రకం.
* పోతున్నా నంటే, నీయంత పోతుకు మేతేడ తెచ్చేది అన్నాడట.
* పోతేపల్లి వారికి పప్పే సంభావన.
* పోయిన కంటికి మందు వేయబోతే, ఉన్న కన్ను ఊడ్చుక (ఊడి) పోయిందట.
* పోయిన చోటెల్లా పొగాకే అడిగితే?
* పోయినది ఒర, ఉండేది కత్తి.
* పోయిన నీళ్ళకు కట్ట బెట్టినట్లు (గతజల సేతుబంధనము).
* పోయిన మొగుడు పోయినా, పొన్నకాయలా గుండు కుదిరింది.
* పోయే కాలానికి అపరబుద్ధి.
* పోరాని చుట్టము వచ్చాడు, బొడ్డువంచి తామలపాకులు కొయ్యమన్నట్లు.
* పోరాని చోట్లకు పోతే రారాని నిందలు రాక మానవు.
* పోరు(డు) గాలితో దీపంబెట్టి నా పాతివ్రత్య మహిమ (దేవుని మహిమ) అన్నట్లు.
* పోరు చాలక పొయ్యిదగ్గఱ పండుకుంటే, బొంతకాలిపోయె నారాయణా!

No comments:

Post a Comment