Saturday, July 13, 2019

ద - ధ >>>> 4

* దాన మీని వాడు ధన్యుండు కాడయా.
* దానములేని విత్తము సంతానం లేని స్త్రీ వంటిది, కలుజు (తూము) లేని చెరువు వంటిది.
* దానాలలోకెల్ల గర్భదా(ధా)నం పుణ్యం.
* దానాలలోకెల్ల నిదానం శ్రేష్టం.
* దాన్ని నమ్ముకొని ధర్మవరం పోతే, అదిపోయి బుక్కపట్టణం చేరిందట.
* దాపున గుడి కట్టితే దూరాన వర్షం (గుడి= చంద్రుని చుట్టు వేసిన వలయం).
* దాయ కట్టని ఆవు తన్నక మానదు (దాయ=బంధము).
* దాయాది ఉంటే నిప్పెందుకు?
* దారికి సుంకం చెల్లించమన్నట్లు.
* దారిద్ర్యము ఆరవ ఇంద్రియము.
* దారిద్ర్యము ఐశ్వర్యము తరతమ భేదాలుగల కలుషములు.
* దారిద్ర్యము నాగరికత సృష్టించినదే.
* దారిద్ర్యమున నుండి తన పూర్వ సంపద లూరక తలచువాడుత్త వెధవ.
* దారిద్ర్యానికి సానుపు పంట.
* దారినపోయే తగులాటాన్ని దాపుకు కొనితెచ్చుకొన్నట్లు.
* దారినపోయే తద్దినమా! (దరిద్రమా) మా ఇంటికి రా అన్నట్లు
* దారినపోయే మారెమ్మా! మా ఇంటిదాకా వచ్చిపో అన్నట్లు.
* దారినపోయ్యే శనిని నా నెత్తిమీదుగా పొమ్మన్నట్లు.
* దారినపొయ్యే శనేశ్వరాన్ని కొనకొచ్చుకొన్నట్లు.
* దారిలో దొరికింది ధర్మానికి పోయింది.
* దాలిగుంటవారు తామరగుంటకు, తామరగుంటవారు దాలిగుంటకు వచ్చినట్లు.
* దాలిగుంటలో కుక్క మాదిరి.
* దాష్టికపు ముష్టి (నియోగిది).
* దాష్టికానికి ధర్మం లేదు, కాయకంటికి చూపులేదు.
* దాసరికి తగిన పూసలు.
* దాసరయ్య తప్పు దండంతో సరి.
* దాసరి తిప్పలు పెరుమాళ్ళ కెఱుక.
* దాసరి పాటకు ముష్టి ముద(జ)రా.
* దాసరి పాట్లు దైవాని కెఱుక.
* దాసరివా జంగానివా అంటే, ముందూరును బట్టి అన్నాడట.

No comments:

Post a Comment