Sunday, July 14, 2019

ప - ఫ >>>> 3

* పందిరి పడి చచ్చినవారు, ఇల్లు పడి బ్రతికినవారు లేరు.
* పందిరే పర్వతము, ఇల్లే ఇంద్రలోకము.
* పందిలాగా కని, పరగళ్ళమ్మ పాలు చేసినట్లు.
* పందిళ్ళు పైన పరువు లెత్తనా?
* పందులు తినేవాని పక్కనే ఏనుగులు గుటకేసే వాడుంటాడు.
* పందుము తిన్నా పరగడుపే, ఏదుం తిన్నా ఏకాదశే!
* పక పక నవ్వేవాడు, గబగబ అరచేవాడు కపటమెఱుగరు.
* పకీర్లను కొట్టి పఠానులకు పెట్టినట్లు.
* పక్క ఇంటి పోరు పండుగంత వేడుక.
* పక్కవాటుగా నడిచే ఎండ్రకాయను చక్కగా నడిచేట్లు ఎవ్వరు చేయగలరు?
* పక్కలో బల్లెము.
* పగ గలిగి బ్రతకటం, పామున్న ఇంట్లో పడుకోవటం ఒక్కటే.
* పగటి మాటలు పనికి చేటు, రాత్రి మాటలు నిద్రకు చేటు.
* పగటి మాషాజీకి (మషాల్జి) అనుమతి ఎవరిచ్చారు? అంటే, నా ఆముదపు చేను ఇచ్చింది అన్నాడట (మషాజి=దీపములు దివిటీలు పట్టేవాడు).
* పగడములేని ఇల్లు, జగడము లేని ఇల్లు ఉండవు.
* పగతో పొరుగిల్లు కాల్చవచ్చును గానీ, తన ఇల్లు కాపాడ తరముగాదు.
* పగపట్టిన త్రాచు కాటు వేయక మానుతుందా?
* పగలు ఎండ, రేయి చీకటి, ఎప్పుడు దున్నుతావే దిన్నపోతా?
* పగలు కొంగులాగితే చీ! అంటే రాత్రి చీకటిలో కన్ను గీటాడట.
* పగలు చస్తే వాతికి లేదు (వాతబియ్యం), రాత్రికి చస్తే దీపానికి లేదు.
* పగలు చెయ్యూపితే రానిది (ఆడుది) రాత్రి కన్నుగీటితే వస్తుందా?
* పగలు చూస్తే రాత్రి కలలో వస్తుంది అన్నట్లు.
* పగలు దాని గుణం చూసి, రాత్రి దాని వెంట వెళ్ళాలి.
* పగలు నిద్ర పనిచేటు, మాపు జాగారణపై చేటు.
* పగలు పక్కచూచి మాట్లాడు, రాత్రి అదీ మాట్లాడవద్దు.
* పగలు పప్పేసిన పయ్యెందుకు పగులు పెండ్లామా? నిత్య బూరెలు చేస్తే నిన్నెందుకు కొడుదు పెండ్లామా? (పై= శరీర పై భాగము, వీపు).
* పగలు పాతరలుండవు (పగలు=స్పర్ధలు, విరోధాలు).
* పగలు ఉపస్థ వెడల్పు, రాత్రి నీళ్ళు వెడల్పు.
* పగలు బట్టలే కంపించకున్న రాత్రి గొఱ్ఱెలు కనిపిస్తాయా?
* పగలు చత్వారి, రాత్రి రేజీకటి.

No comments:

Post a Comment