Sunday, July 14, 2019

ప - ఫ >>>> 4

* పగలెల్లా బారెడు నేసినాను, దివ్వె తేవే దిగనేస్తాను అన్నదట.
* పగవాణ్ణి పంచాంగ మడిగితే, మధ్యహ్నానికి మరణ మన్నాడట.
* పగవాని ఇంట ఫది బిచ్చాలు పోయినా పోయినవేను.
* పగవారిని చెరబట్టక ముద్దాడవత్తురా?
* పచ్చగా ఉంటే పారాడేది, వెచ్చగా ఉంటే వెళ్ళిపోయేది.
* పచ్చగా ఉన్నవాళ్ళకు, ఎదుటివారి వెచ్చన తెలియదు.
* పచ్చగా ఉన్న దగ్గఱ మేసి, వెచ్చగా ఉన్నదగ్గఱ పండు.
* పచ్చడ మున్నంత కాళ్ళు చాచు.
* పచ్చని పందిట్లో పట్టుకున్న పిశాచి ఎక్కడికీ పోదు.
* పచ్చని పైకము గుఱ్ఱము చచ్చినదాకానే.
* పచ్చని వరహా కంటే, పుచ్చిన గింజే మేలు.
* పచ్చికంకులే దాసరీ, అంటే రాలినకాడికే గోవిందా అన్నాట్ట!
* పచ్చికంకులోయి దాసరీ అంటే రాలినకాడికే రామార్పణం అన్నాడట.
* పచ్చికాయ తుంచిన పండవుతుందా?
* పచ్చికుండలో నీళ్ళుపోయి, నీ పాతివ్రత్యం తెలుస్తుంది అన్నట్లు.
* పచ్చిపేడను తంతే, పదహారు వక్కలయ్యే ప్రాయం.
* పచ్చివెలగకాయ గొంతులో పడ్డట్లు.
* పటేలువారి వడ్లపుణ్యాన్నా, మా యత్త ముడ్డి పుణ్యాన్నా తింటినమ్మా పుల్లటికూర మెతుకులు.
* పట్టణానికి పోయిన గాడిద, పల్లెకు పోయిన గాడిదని కఱచిందట.
* పట్టపగలు కన్న మేస్తావేమిరా? అంటే, నా కడుపు కక్కూర్తి నీకేమి తెలుసును? అన్నాదట.
* పట్టపు రాజు చేపట్టగానే గుడిసేటి ముండకు గుణము రాదు (గుడిసేటి=గుడికి చేటి-దేవదాసి. ఇప్పుడు విడిచినది వ్యభిచారిణి).
* పట్టినదెల్లా బంగారం, ముట్టినదెల్లా ముత్యం.
* పట్టినవాడు (పట్టుకొన్నవాడు) తాబేలు అంటే, గట్టునున్నవాడు కుందేలు అన్నట్లు.
* పట్టినవాడు పక్కి అంటే, గట్టునున్నవాడు జెల్ల అన్నట్లు (పక్కి=చిన్న వెడల్పు చేప, జెల్ల=తేలువలే కుట్టే చిన్నచేప).
* పట్టినవాడు వరిగపిల్ల అంటే, పట్టనివాడు మట్టపిల్ల అన్నాడట.
* పట్టినవాడు మట్టగుడిసె అంటే, ఒడ్డునున్నవాడు జల్లపిల్ల అన్నట్లు (మట్టగుడిసె=నల్లటి చిన్న చేప).
* పట్టిపట్టి పంగనామం పెడితే గోడచాటుకెళ్ళి గోకేసుకున్నాడట.
* పట్టివిడిచిన ముండకు పటొటాపం జాస్తి.
* పట్టివిడిచిన ముండ (మొగుడు విడిచిన ముండ) మబ్బు విడిచిన ఎండ.

No comments:

Post a Comment