* నమాజు చేయబోతే మసీదు మీద పడ్డట్లు.
* నమిలేవాడికన్నా, మింగే వాడే ఘనుడు.
* నమ్మించి గొంతుకోసినట్లు.
* నమ్మితి రామన్నా అంటే, నట్టేట ముంచుతాను లక్ష్మన్నా అన్నట్లు.
* నమ్మితి రామన్నా అంటే, నా అంతవాణ్ణి చేస్తానన్నట్లు.
* నమ్మిన ఇమ్ము, నమ్మకున్న అమ్ము.
* నమ్మిన ఎనుము పోతు అయ్యిందట.
* నమ్మి నడివీధిలో వేసిన వారెవరు?
* నమ్మి నానబోస్తే, పులిసి బూరటిల్లిందట.
* నయముంటే భయమేమి?
* నయము నష్టకారి, భయము భాగ్యకారి.
* నయాన పాలు తాగరు, భయాన విషమైనా తాగుతారు.
* నయాన కానిపని భయాన అవుతుంది.
* నరంవంటి వాడికి జ్వరం వస్తే, చేయి చూచినవాడు బ్రతుకడు.
* నరకములో కరుణ లేదు, నాకంలో మరణం లేదు.
* నరకములో నారాయణుడుండునా?
* నరకానికి నవద్వారాలు, నాకానికి ఒకటే.
* నరాలు లేని నాలుక నానావిధాల పలుకుతుంది.
* నరుకలేని బంటు, కత్తి చుఱుకు లేదన్నట్లు.
* నరునకు నరుడు, తరువుకు వేరు సహాయం (అండ).
* నరునికి నాలు గంశలు.
* నరునికి సుద్దంబద్దంలేదు, గుంజుగుంజు నడేటిలోనికి- అన్నదట మొసలి.
* నర్మదలో మునిగినా కర్మం తప్పదు.
* నలపాకము, భీమపాకము. (మగవాడు చేసే వంట)
* నలసారము, సంసారము.
* నలిగి ఉన్నప్పుడు తొలిగి ఉండమన్నారు.
* నలుగురితో చావు పెండ్లితో సమానం.
* నలుగురితో పాటు నారాయణా! కులముతో పాటు గోవిందా.
* నలుగురు చేతులువేస్తే గొడ్రాలికి కూడా పిల్లలు పుడతారు.
* నలుగురి తరవాత పుడితే నట్టిల్లు బంగారమవుతుంది, ముగ్గురి తర్వాత పుట్టితే ముయ్య మూకుడుండదు.

No comments:
Post a Comment