* గప్పాల పోతిరెడ్డికి ముప్పైమూడు దొడ్లు, మూడు ఎడ్లు.
* గబగబా అరిచేవాడి పంచ చేరవచ్చును గానీ, నేలముచ్చోడి కడప తొక్కరాదు.
* గబ్బరీడు కార్తె వర్షాలకు దిబ్బలు కూడా కరుగుతాయి.
* గబ్బిలము ఆకాశాన్ని పడకుండా పట్టుకుని ఉన్నానన్నట్లు.
* గబ్బిలం వలే అటు పక్షి కాదు ఇటు జంతువూ కాదు.
* గబ్బిలాయి మొగం నవ్వినా ఒకటే, ఏడ్చినా ఒకటే.
* గబ్బుకు గంపెడు ఈగలు.
* గబ్బువాడూ, గదరువాడు వియ్యమందితే, మురికివాడు వచ్చి ముద్దాడినాడట.
* గయ్యాళి, గచ్చపొద ఒకటి.
* గయ్యాళి రచ్చకెక్కితే, సంసారి దొంతుల సందున దాక్కుంది.
* గరిసె విత్తనాలు పోసి, గంపెడు విత్తనాలు తెచ్చుకొన్నట్లు.
* గఱిక చేను గాడిద పాలు.
* గఱిక మేసిన గాడిద చస్తుందిగానీ గఱిక చావదు.
* గరుడాయ లెస్సా? అంటే శేషాయ లెస్సా అన్నాడట.
* గరుత్మంతుడిని చూసిన పాము వలె.
* గర్భదానం అంటే వడలు తినటమనుకున్నానే, గుద్దదిరే పనే అన్నదిట కొత్త పెండ్లికూతురు.
* గర్భదానం నాటి ముచ్చట్లు లంఖణాలలో తలచుకొన్నట్లు.
* గర్భదానానికి రమ్మని జాబు రాస్తే, రాను తీరికలేదు, నేనున్నట్లే పనిజరిపించండి అని వ్రాసినాడట.
* గవ్వన్నరకు గడ్డం గొరుగుతా అంటే, వెంట్రుకున్నరకు ఎంతా? అన్నాడట
* గాజుకుప్పెలో దీపంవలె.
* గాజుపూసల గనిలో మణి దొరకునా?
* గాజులబేరం భోజనానికి సరి.
* గాజుల చెయ్యి గల గలలాడితే, ఇల్లు కలకల లాడుతుంది.
* గాటాలు తిన్న కోడె గాటికి రానట్లు (గాటాలు=కష్టాలు).
* గాటి పిచ్చి గూటి పిచ్చి లేగితే అణిగేది కష్టం.
* గాటిలో కుక్క గడ్డి తినదు, తిననీయదు.
* గాడి తప్పిన బండి వలె.
* గాడిదకు గడ్డివేసి ఆవును పాలివ్వమన్నట్లు.
* గాడిదకు తనకూత కమ్మగానే ఉంటుంది.
* గాడిదకు పులితోలు కప్పితే కఱవ గలదా?

No comments:
Post a Comment