Saturday, July 13, 2019

గ - ఘ >>>> 5

* గాడిదకు భోగి నీళ్ళు పోస్తే బూడిదలో పొర్లాడిందట.
* గాడిద కేమితెలుసు గంధపు పొడి వాసన.
* గాడిద కొడకా అంటే, తమరు తండ్రులు మేము బిడ్డలము అన్నాడట.
* గాడిద గుడ్డు కప్ప తలకాయ
* గాడిద గుడ్డు, గరుడ భంగం.
* గాడిద గుడ్డు గంధపు సాన.
* గాడిద చంటిలో కడివెడు పాలు.
* గాడిదలతో సేద్యం చేస్తూ, కాలి తన్నులకు దడిస్తే ఎలా?
* గాడిదతో స్నేహం కాలి తన్నులకే.
* గాడిద పిల్ల కోమలం.
* గాడిద పుండుకు బూడిద మందు.
* గాడిద పూర్వ వంశగౌరవం గానీ, భవిష్యత్సంతతిపై గానీ ఆశలేని జీవి.
* గాడీద ముండా ! ఏటేటా కంటావేమిటే? అంటే నాకు కోపం వస్తే నడుంగల కూడా కంటా అన్నదిట.
* గాడిద మోయదా గంధపు చెక్కలు.
* గాడిదలకు నేల గడ్డముల్ మీసముల్.
* గాడిదల మోత గుఱ్ఱాల మేత
* గాడిదలెన్ని మేసినా గరిక తరుగుతుందా?
* గాడిదలే దున్నితే, దొమ్మరులు పంత కాపులు కారా?
* గాడిద సంగీతానికి ఒంటె ఆశ్చర్యపోతే, ఒంటె అందానికి గాడిద మూర్చపోయిందట.
* గాడిదలా పరుగెత్తినావేమంటే, గుంపులో చేరబట్టి బెదురు తీరిందన్నాడట.
* గాడుపట్టిన గంగానమ్మ పూజారితో పోయినట్లు.
* గాఢాలింగన సౌఖ్యం ప్రౌఢాంగన ఎరుగుగాక బాలేమెరుగున్?
* గాడుపుకు గడ్డపార కొట్టుకపోగా, ఉల్లిపొట్టు నాగతి ఏమీ? అన్నదిట.
* గాదెకింద ఎలుక గాదెకిందే బతకాలి.
* గాదెకింద పందికొక్కు వెలె.
* గాదెడు కొఱ్ఱులు తిన్నా, కౌజు మూడేకాసులు (కానులు).
* గాదెడు దోసకాయలలో చేటడు కొఱ్ఱలు పట్టవా?
* గాదెనిండా బియ్యముంటే, కఱువునా, కాలనా నా భార్యను పిల్లలను నేనే రక్షిస్తాను అన్నాడట.
* గాదెలో గింజలు గాదెలోనే ఉండాలి, బిడ్డలు గారకాయలులా ఉండాలి.
* గానుగెద్దు ఒక్కసారిగా దిక్కిటెద్దు అవుతుందా?

No comments:

Post a Comment