Saturday, July 13, 2019

చ - ఛ >>>> 4

* చదువు లేదు సంధ్య లేదు, సంతానం మాత్రం మెండు.
* చద్ది కంటే ఊరగాయ ఘనం.
* చద్దికూడు తిన్నమ్మ మగని ఆకలెరుగదు.
* చద్ది తెచ్చుకున్న బ్రహ్మణుడా! భోజనం చెయ్యి.
* చద్ది నాకు పెట్టమ్మా, ఆకలికాకుండా నీకు మందిస్తా అన్నాడుట.
* చద్ది పురిసెడు, ఊరగాయ దోసెడు.
* చద్ది మూటలో సారం చాకలి ఎరుగును.
* చద్దెన్నం మీద వెన్న చంద్రుడౌతుందా?
* చన విస్తే చంక కెక్కినట్లు.
* చనువు చేసిన ఆలి చంక కెక్కు.
* చన్ను కుడిచి, రొమ్ము గ్రుద్దినట్లు.
* చన్ను, తోటకూరా చెయ్యి తగలనిదే పెరుగవు.
* చమురు దండుగ భాగవతం (భాగోతం).
* చమురు నష్టియే గానీ పిల్ల బ్రతుకదు.
* చమురున్న పెంకు ఎప్పుడూ పేలదు.
* చరిత్ర పునరావృత్తు నొందును.
* చరిత్ర వివేకులకు దారిచూపి, అవివేకులను వెంట ఈడ్చుకొనిపోవును.
* చలాకి లేకపోయినా సలాకిలా ఉండాలి.
* చలికి జడిసి కుంప టెత్తుకొన్నట్లు.
* చలిజ్వరము: అన్నంలో చెయ్యి తియ్య బుద్ధికాదు.
* చలి దూరందే బీర పూయదు.
* చలిబడనేల, సీతుగాయనేల?
* చలివేంద్ర కుండలకు తూట్లు పొడిచినట్లు.
* చల్లకుండకు, చంటిబిడ్డకు చాటుండాలి.
* చల్లకు వచ్చి ముంత దాచనేల?
* చల్లకేంగానీ, గొల్లది బాగుందన్నాడట.
* చల్లకు బాలును గలసిన చల్లకు దోడంటినట్లు.
* చళ్ళు చూచుకొని సంబరపడితే సరా? ముందరి పాటు చూసుకో అన్నాడట (ముడ్డిపడే పాటు చూసుకో).
* చళ్ళు జారిన ముండకు, వట్టలు జారిన విటకాడు.
* చవి ఎరిగిన కుక్క చావకొట్టినా పోదు.

No comments:

Post a Comment