Saturday, July 13, 2019

చ - ఛ >>>> 5

* చవితి చంకనాకి నట్టే ఉంది ఏకాదశి అన్నాడట.
* చవిటి ఉప్పు కందచక్కెరవలేనున్నా, అనుభవసుఖం లేదు.
* చవిలేని కూడు కుడిచినట్లు.
* చవిసారం లేని కూర చట్టి నిండా, ఆంగంపాగంలేని మొగుడు మంచం నిండా.
* చవిసారం లేనివాడు సంచారంపోతే, ముసలినక్కలన్నీ గుసగుస లాడినవట.
* చవుక (చౌక) కొననివ్వదు, ప్రియం అమ్మనివ్వదు.
* చస్తానని చద్దెన్నం తింటే చల్లగా నిద్రవచ్చిందట.
* చస్తూ ఉంటే సంద్యమంత్రం చెప్పమన్నట్లు.
* చస్తే చచ్చాడుగానీ, చలిజ్వ్రం చప్పగా వదిలింది.
* చస్తేగానీ బఱ్ఱెపాడి బయటపడదు.
* చాకలి అత్త, మంగలిమామ. కొడుకు సాలోడైతేనేమి? సాతానోడైతేనేమి?
* చాకలి కట్టని గుడ్డ, సైను ఎక్కని గుఱ్ఱము లేదు (సైను=గుఱ్ఱము కాపరి).
* చాకలి కొత్త, మంగలి పాత.
* చాకలి తెలుపు, మంగలి నునుపు తప్ప, అయ్యదగ్గర ఏమీలేదు.
* చాకలిదాని చక్కదనానికి సన్యాసులు గుద్దుకొని చచ్చారుట.
* చాకలిదానితో సహవాసం చేస్తే, గాడిద వచ్చి గర్వపడిందట.
* చాకలిది సందెఱుగదు, మాలది మంచమెఱుగదు.
* చాకలిని క్షవరం చెయ్యమంటే, చెక్కుతీసి చేతిలో పెట్టినాడట.
* చాకలిమంగలి పొత్తు, ఇంటికి రాదు విత్తు.
* చాకలివాడి భార్యకు మంగలివాడు విడాకులిచ్చినట్లు.
* చాకిరిచేసే చాకలికి లేదుగానీ, గొరిగే కొండయ్యకిస్తారు.
* చాకిరేవు ఒకచోట, ఏలపాట ఇంకొకచోట.
* చాటెడు తిని చెడితి, వాకిలిదాటి పడితి.
* చేదను చూచి బొక్కెనబాయిలో ఏసిందట.
* చాదస్తం అంటే, చెరిసగం అన్నట్లు.
* చాదస్తం మొగుడా, నీ చారెడు వేరే వండుకో అన్నట్లు.
* చాదస్తపు మొగుడు చెపితే వినడు, చెప్పకుంటే కరుస్తాడు.
* చాదస్తపు మొగుడు చెపితే వినడు, గిల్లితే ఏడుస్తాడు.
* చాదస్తపు మొగుడు చెపితే వినడు, కొడితే ఏడుస్తాడు.
* చాప చిరిగినా చదరంత కాదు.

No comments:

Post a Comment