* పట్టి విడుచుటకంటే ప్రాణం విడుచుట మేలు.
* పట్టిసం తీర్ఠానికి పత్తిగింజలంత మామిడిపిందెలు.
* పట్టు కత్తిరించినట్లు మాట్లాడినా మనసేమో పలుగురాయి.
* పట్టుకొమ్మను నరుకు కొన్నట్లు.
* పట్టుగుడ్డకు, భ్రష్టుముండకు అంటులేదు.
* పట్టుచీర ఎరవిచ్చి, పీటపట్టుక వెంట తిరిగినట్లు.
* పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు.
* పట్టుపట్టు మనేవాళ్ళేగానీ, పట్టేవాళ్ళూ ఒక్కరూ లేరు.
* పట్టుపుట్టము తొత్తుకు కట్టబెట్టిన పేడమరకలతో పాడుచేయును.
* పట్టెడు బొట్టుంటే పదిలక్షలు.
* పటనం దగ్గరకు వచ్చి పల్లెలో రత్నపరీక్ష చేయించినట్లు.
* పట్నం పోయి పుట్నం గింజ తెచ్చాడన్నట్లు.
* పఠానులకు నేను బాకీ, ఫకీరులు నాకు బాకీ.
* పడుచువాని పెండ్లాము ప్రణయిని, నడిప్రాయం వానిభార్య సహధర్మచారిణి, ముసలివాని ఇల్లాలు దాసి.
* పడతులకు బుద్ధి పెడతల నుండు.
* పడతుక, వంకాయ, సమూలమధురములు.
* పడబోయి పూపాన్పుపై పడినట్లు.
* పడమట క్రుంకిన పొద్దు తూర్పున లేవదా?
* పడమట కొఱడువేస్తే పాడుగుంటలన్నీ నిండును; తూర్పున వేస్తే తుంగగడ్డి కూడా మొలవదు (కొఱడు, కొఱ్ఱు=ఇంద్ర ధనుస్సు).
* పడమట కొఱ్ఱుఒడ్డితే (వేస్తే) పందిళ్ళమీద రాజనాలు పండుతాయి.
* పడమట కొఱ్ఱువేస్తే పాడిఆవు ఱంకె వేస్తుంది.
* పడమట పావురాపిట్టంత (పూరేడుపిట్టంత) మబ్బు నడీతే, పాతాళందాకా వాన.
* పడమట మెరిస్తే, పంది అయినా నీళ్ళకు దిగదు.
* పడమటివీధి అమ్మ సరిగ పెట్టుకుంటే, ఉత్తరవీధి అమ్మ ఉరి పెట్టుకుందట.
* పడవ ఒడ్డు చేరితే పడవవాని మీద ఒక సొడ్డు.
* పడిన గోడలు పడ్డట్లుండవు, చెడిన కాపురం చెడి నట్లుండదు.
* పడిలేస్తే పాతరలోతు తెలుస్తుంది.
* పడిశము పది రోగాల పెట్టు.
* పడుకోవడం పాతగోడలలో, కలవరింతలు మిద్దెటిండ్లలో.
* పడుగు పేకా కలిస్తే గుడ్డ, ఆలుమగడు కలిస్తే ఇల్లు.

No comments:
Post a Comment