Saturday, July 13, 2019

ద - ధ >>>> 5

* దాసి కొడుకైనా, కాసులు కలవాడే రాజేంద్రుడు.
* దాసికి శిక్ష తలగొరిగింపు, భార్యకు దండన పడక వెలివెత.
* దాస్యం ప్రతి ఆత్మలో పెరిగే కలుపు మొక్క.
* దాసుని తప్పు దండముతో సరి.
* దాక్షారామం భీమన్నలా ఎంత పొడుగు?(భీమేశ్వరాలయంలో లింగము పొడవైనది, రెండంతస్తుల ఆలయం).
* దింపుడు కళ్ళ మాశ (కడపటి ఆశ).
* దిక్కులన్నీ ఒక్క దిక్కుకు తెచ్చినట్లు.
* దిక్కులేని ఇంట్లో దెయ్యాల కాపురం.
* దిక్కులేని నాడు ఊరికి నక్కే పోతురాజు.
* దిక్కులేని వారికి దేవుడే దిక్కు.
* దిగంబర సన్యాసికి చాకలితో అవసరమేమి?
* దిగితే గానీ లోతు తెలియదు.
* దిగు దిగు మనే నాసవతే గానీ, దిగే నా సవతే లేదు (ఒక సవతి లేదు).
* దినదినగండం నూరేండ్లాయుస్సు.
* దినము మంచిదని తెల్లవార్లు దోచినట్లు.
* దినమూ చచ్చేవానికి ఏడ్చేదెవరు?
* దినమూ ప్రయాణం చద్దెన్నం చేటు (తినుటేగానీ ప్రయాణం సాగుటలేదు).
* దినవెచ్చం దివిటి వెలుగు - పూటబత్తెం పుల్ల వెలుగు.
* దిబ్బాలమ్మకి దీపం పెడితే, పందిమగడు వచ్చి పడదోసిపోయే.
* దిమాకి ఎక్కినవాడు దిక్కులు చూస్తే, పలాకి ఎక్కినవాడు ప్రక్క చూచినాడట.
* దివాణంలో దిక్కు లేదు, అంబటిలో ఉప్పు లేదు.
* దివిటి ముందు దీపం పెట్టినట్లు.
* దివ్వె తీసిన గూడు వలె.
* దిసమొలవాడా! కాళ్ళకట్టువాని కప్పు మన్నట్లు.
* దిసమొల వానికి దిగంబరుడు బట్ట కట్టినట్లు.
* దిసమొలవాణ్ణి గోచిపాతగాడు బట్ట అడిగినట్లు.
* దీపము ఆరినతరువాత దినుసంతా ఒక్కటె.
* దీప ముండగానే ఇల్లు చక్కవెట్టుకోవలె.
* దీపముండగానే నిప్పుకు దేవులాడినట్లు.
* దీపం పేరు చెపితే చీకటి పోతుందా?

No comments:

Post a Comment