Saturday, July 13, 2019

గ - ఘ >>>> 6

* గానుగరోట్లో చెయ్యిపెట్టి పెరుమాళ్ళ కృప అన్నట్లు.
* గానుగ రోలు సెద్దె కుడుపేడయింది.
* గానుగల(లో) నూ(పు)గులుపోసి గానుగకింద సిద్ది పెట్టిందట.
* గానుగాపే, గానుగాపే, నీవు కూర్చున్న పనేగా నూనెపోయటం.
* గాము సోకినట్లు.
* గారాబం గంజికేడిస్తే, ముసలివాడు ముండ కేడ్చాడట.
* గారాబం గారెలకేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.
* గారాము గుర్రాని కేడిస్తే, వీపు దెబ్బలకేడ్చిందట.
* గారాల బిడ్డపుడితే, గడ్డపారతో చెవులు కుట్టినట్లు.
* గారువాల బిడ్డకు గడ్డపారతో చెవులుకుట్టి సలికెపారలు తీగలేసిందట. (సలికెపార=మన్ను చెలిగే పార).
* గారెలు వండాలే పెళ్ళామా అంటే, వేలు చూపించినట్లు.
* గాలి ఇరవు గాలికే తెలుసు.
* గాలి ఉన్నప్పుడే తూర్పాన పట్టాల.
* గాలి చిన్నదీపాన్ని ఆర్పి, మంతను పెద్ద చేస్తుంది.
* గాలికి పుట్టి, (దుమ్ముకు) ధూళికి పెరిగినట్లు.
* గాలికి పోయిన కంపను కాలికి తగిలించుకొన్నట్లు.
* గాలికి పోయిన పేలాలు కృష్ణార్పణం.
* గాలికి పోయిన పేలాలు రామార్పణం (కృష్ణార్పణం) అన్నట్లు.
* గాలికి పోయేదానిని కాలిమీదకు దోచుకొన్నట్లు.
* గాలితో తాడు పేనినట్లు.
* గాలిని మూట కట్టీనా, గయ్యాళి నోరు కట్టలేడు.
* గాలిపాటు, కలిమి తేట.
* గాలిమేడలు గురివింద సామ్యం.
* గాలి లేనిదే దుమారం లేచునా?
* గాలిలో దీపంపెట్టి దేవుడా నీ మహిమ అన్నట్లు.
* గాలిలో మేడలు కట్టినట్లు.
* గాలీవానా కలిస్తే కధ మాసింది.
* గిరిపూను భారము కరిపూన గలదా?
* గిరాకి కొననివ్వదు, మందం అమ్మనివ్వదు.
* గిరాకి కోమట్ల పాలు, మందం మూలల (మాలల) పాలు.

No comments:

Post a Comment