Saturday, July 13, 2019

ద - ధ >>>> 6

* దీపం ముడ్డికిందనే చీకటి.
* దీపాన వెలిగించిన దివిటీ పెద్దదైనట్లు.
* దీపావళికి దీపమంత చలి.
* దీపావళి వర్షాలు దీపాంతరాలు దాటుతాయి.
* దీప్తభానుని గని తిమిరంబు నిలుచునా?
* దీవించువారు ఏండ్లేల ఇస్తారు?
* దుంగ దించి బండ నెత్తుకొన్నట్లు.
* దుక్కం (దుఃఖం) లేనోడు దూడను గడిచ్చుకొన్నాడట (గడిచ్చు= సంపాదించు).
* దుక్కంగా పోయి దులువంగ వచ్చు (దులుపుట=ధాన్యం రాల్చుట, కుప్ప నూర్పిళ్ళ సమయం).
* దుక్కి ఉంటే దిక్కు ఉంది.
* దుక్కి కొద్దీ పంత, బుద్ది కొద్ది సుఖం
* దుక్కిగల భూమి, దిక్కుగల మనుజుడు చెడడు.
* దుక్కి చలువే చలువ - తల్లి పాలే పాలు.
* దుక్కుటెద్దుకు పంచదార అటుకులు కావలెనా?
* దుక్కిటెద్దు చావు, పక్కలో పెళ్ళాంచావు వంటిది.
* దుక్కిటెద్దు దేశాంతరం పోయినట్లు.
* దుక్కిటెద్దు బుట్టమేపువేళ గాటికి లాగినట్లు.
* దుక్కిటెద్దు దేశాంతరం వెళ్ళితే పట్టీ దున్నించారట.
* దుక్కిటెడ్లు పోట్లాడి దూడల కాళ్ళు విరిచినట్లు.
* దుడ్డూకఱ్ఱా దుడ్డుకఱ్ఱా ఎవరి మాట వింటావే? అంటే, ఎవరిచేతిలో ఉంటే వారిమాట అన్నదిట.
* దుక్కినాగలి చెక్కే వడ్రంగికి మేడలుకట్టు నేర్పుండునా?
* దుడ్డుకఱ్ఱ అనగానే బుఱ్ఱ బద్దలవుతుందా?
* దుడ్డుకు ఒక్కడైనా దూదేకులవాణ్ణి జీతాని కుంచుకోకు.
* దుడ్డు దుగ్గనిలేని నాబట్ట దువ్వింది దువ్విందే.
* దుత్తకు పాల రుచి తెలుసునా?
* దున్నంగపోయి దులపంగ వచ్చు.
* దున్న ఈనినదంటే, దూడను గాట కట్టి వేయమన్నట్లు.
* దున్నక చల్లితే కొయ్యక పండును.
* దున్నని వానికి గుడ్డ ఎందుకు? ఏలనివానికి పెండ్లామెందుకు?
* దున్నక వేసిన ఆముదాలు, ఆసాది కిచ్చిన అప్పు తిరిగిరావు.

No comments:

Post a Comment