Saturday, July 13, 2019

గ - ఘ >>>> 7

* గుంటక పురాణం, గంప శతకం.
* గూంతకాకి వింటి దెబ్బ ఎరుగదు.
* గుంటలో బిడ్డా, కడుపులో బిడ్డ.
* గుంటూరు పొగాకు గుట్లో ఉన్నా ఒకటె, నోట్లో ఉన్నా ఒకటె.
* గుండి (గుండ్రాయి) మింగేవాడికి తలుపులు అప్పడాలు.
* గుండ్రాయి దాస్తే కూతురి పెండ్లి అగునా?
* గుండ్లకమ్మ నిండి దరిచేరనీయదు, గంపకమ్మ కలిగి తిననీయదు.
* గుండ్లు తేలి, బెండ్లు మునిగినట్లు.
* గుంతకు వస్తే మరదలి, మెట్టకు వస్తే వదిన.
* గుగ్గిలం వెయ్యకపోతే పోయినావుగానీ గుళ్ళో పిత్తవద్దు.
* గుగ్గిళ్ళకు కొన్న గుఱ్ఱాలు అగడ్తలు దాటుతాయా?
* గుగ్గిళ్ళకు నోరు తెరిచి, కళ్ళానికి నోరు మూసినట్లు.
* గుట్టకు మొరిగిన కుక్క గ్రుడ్లువెళ్ళి చచ్చిందట.
* గుట్టు మీరువారు గురువునకు గురువురా.
* గుడగుడ ఆలోచన గుడిశకు చేటు.
* గుడగుడ శబ్ధం కుండకు నష్టం (మోసం).
* గుడారంలో గూని బతుకు.
* గుడి అంతా దేముడైతే గుదమెక్కడ పెట్టేది?
* గుడి ఉమ్మడి గంతలకు గుట్టు ఉంటుందా?
* గుడీ కట్టేవాడొకడు, గుళ్ళో దీపం పెట్టేవాడొకడు.
* గుడికొట్టి ఇటికల తులసి తిన్నెలు గట్టిన ధర్మాత్ముడగునా?
* గుడి చిన్నదైనా గుళ్ళో దేవుని మహిమ మిన్న.
* గుడి చుట్టూ తిరిగి బొడ్డులో వేలు పెట్టుకొన్నట్లు.
* గుడి దెగ్గరైతే గురుత్వం దూరమౌతుంది.
* గుడి నుండి గుడిరాళ్ళు తీసేవారు.
* గుడీరాళ్ళు కరచినట్లు, గంగిగోవు పొడిచినట్లు.
* గుడి మింగేవానికి గుడిలో లింగం ఉట్రవడియం.
* గుడీ మింగేవాడొకడైతే, గుడీని లింగాన్ని మింగేవాడింకొకడు, గుడీని గోపురాన్ని మింగేది మరిఒకడు.
* గుడి మింగేవానికి నంది పిండి మిరియం.
* గుడిమీదనుండి పడినా, గుండాములో పడినా ఒకతే.

No comments:

Post a Comment