* పదిమందితో చావు పెండ్లితో సమానం.
* పదిమంది నడిచింది బాట, పదిమంది పలికింది మాట.
* పదిమందిలో పడ్డ పాము చావక పోతుందా?
* పదియవనాటి ముత్తైదువ వలె (పసుపు కుంకుమ తీసిన తరువాత).
* పదిరాళ్ళు వేస్తే ఒకరాయైనా తగులదా?
* పది వేస్తే పచ్చిపులుసు, లేకపోతే పాడుపులుసు.
* పదురురాడుమాట పాడియై ధర చెల్లు, ఒక్కడాడుమాట ఎక్క దెందు.
* పద్మరాగాల గనిలో గాజుపెంకులుంటాయా? (అన్నట్లు).
* పద్మాసం వేసి కూర్చుండగానే పరమాన్నం వడ్డిస్తారా?
* పద్మినీరతివేడ్క పాంచాలుండుగాక షండుడు తెలుయగలడా?
* పనసకాయ దొరికినప్పుడే తద్దినం పెట్టమన్నట్లు.
* పనసపండు తెచ్చి పళ్ళేంలో పెడితే, తినలేని బ్రాహ్మణుడు దిక్కుదిక్కులు చూసాడట.
* పనసపండ్లలో మామిడిపండ్ల రసముండునా?
* పనాపాటా, పండుకో మగుడా అన్నదట.
* పనాపాటా పెండ్లామా అంటే, పండుకొందాం రమ్మన్నదట.
* పని అంటే నా ఒళ్ళు భారకిస్తుంది, బువ్వ అంటే నా ఒళ్ళు పొంగి వస్తుంది.
* పనికి పరాకు, తిండికి హుషారు.
* పనికి పీనుగు, తిండికి ఏనుగు.
* పనికిమాలు తొత్తు బత్తెంబు చేటయా.
* పనికి బడుగు, తిండికి పిడుగు.
* పని గలవాడు పందిరి వేస్తే, కుక్కతోక తగిలి కూలిపోయిందట.
* పని గలవారింట్లో పైసల ఏట్లాట, పని లేనివారింట్లో పాపోసుల ఏట్లాట.
* పని చేయనివాడు ఇంటికి దొంగ, పన్నివ్వనివాడు దివాణానికి దొంగ.
* పని చేయనివానికి ప్రగల్భా లెక్కువ.
* పని తక్కువ, ప్రాకులాట ఎక్కువ.
* పని పాతరబెట్టి, గంప జాతరకు పోయినట్లు.
* పని ముద్దా? పాటు ముద్దా?
* పని లేక పటేలు ఇంటికి పోతే, పాతగోడకు పూత పెట్టమన్నాడట.
* పని లేకుంటే పంటకాపింటికి (పంటోళ్ళింటికి) పో, పందిరి గుంజకు గూడా పని చెప్పుతారు.
* పని లేకుంటే పంటకాపింటికి పోతే, పందిటిగుంజలుగూడా పని చెప్పతవి.

No comments:
Post a Comment