Saturday, July 13, 2019

ద - ధ >>>> 7

* దున్న తగిలితే మన్ను ముట్టవలెను.
* దున్న దగ్గర వీణ వాయించినట్లు.
* దున్నపోతు తన వీపు తోముకోలేదు, వాడు తోముకోగలడు, అంతే భేదం.
* దున్నపోతు ఈనిందంటే చెంబుతేరా పాలుపితుకుదా మన్నట్లు.
* దున్నపోతు మీద వాన కురిసినట్లు.
* దున్నపోతులా ఉన్నావు తేలుమంత్రం తెలియదా? అన్నాడట.
* దున్నబోతే దూడలలోను, మేయబోతే పోతులలోను.
* దున్నలా కష్టపడి దొరలా తినవలె.
* దున్నిన పొలానికి తాగిన గంజికి సరి.
* దున్నే అదనులో దూరదేశం పోయి, కోతలకాలంలో కొడవలిపట్ట వచ్చినాడట.
* దున్నే ఎద్దునే పొడిచేది (ములుకర్రతో).
* దున్నేవాడు లేక్కచూస్తే నాగలి కూడా మిగలదు.
* దున్నేవాళ్ళకు వేళ్ళు (లేళ్ళు) చూపించినట్లు.
* దుప్పి కాలంగాక చిక్కును గానీ కాళ్ళు లేకగాదు.
* దురదృష్టము ననుభవించ లేనివాడు అదృష్టమును అనుభవించలేడు.
* దురదృష్టం పదనువాదరగల కత్తివంటిది. పిడిని పట్టుకొనిన ఉపయోగపడును, వాదర పట్టుకొనిన తెగును.
* దుర్గంధ కుసుమంకంటే, నిర్గంధ కుసుమం మేలు.
* దువ్వును చూచి నక్క వాతలు పెట్టుకొన్నట్లు (దువ్వు=పులి).
* దుష్టుడు కలహించటమంతా శిష్టులకే మేలు.
* దుష్టునిచూచి దూరంగా ఉండమన్నారు.
* దుఃఖమును అణుచుకోగలిగిన వానికంటే సంతోషాన్ని అణచుకోగలిగిన వాడే ఘనుడు.
* దుఃఖము సుఖమును వెన్నుదన్నే వెన్నాడుచుండును.
* దూకుదూకు మనేవాళ్ళేగానీ, దూకే లంజాకొడుకు ఒక్కడూ లేడు.
* దూడ కుడిచినట్టా? దుత్తలో పడ్డట్టా?
* దూడ కుడిస్తే గానీ ఆవు చేపదు.
* దూడ కుడిస్తేనే గానీ దుత్త నానదు (తడవదు).
* దూడ-తల్లి ఉండగా గుంజ అరచిందన్నట్లు.
* దూడపాలు దుత్తకే సరిపోయె.
* దూడ పొదుగును కుమ్మితే గానీ ఆవు చేపదు.
* దూడ మేసి గంటసేపైనా, దురిసెండ్ల నడతమాత్రం పోలేదు.

No comments:

Post a Comment