Saturday, July 13, 2019

న >>>> 6

* నవ్వులతోటలో నాగులు తిరుగును.
* నవ్వే ఆడుదాన్నీ, ఏడ్చే మగవణ్ణి నమ్మరాదు.
* నవ్వేవారి ముందు జారిపడినట్లు.
* నష్టపడినా భ్రష్టు కారాదు.
* నాంచారమ్మ వంట, నక్షత్రదర్శనము ఒక్కమారే (ఆలస్యమగునని).
* నా ఇంటికి నేను పెద్దను, పిల్లికి పెట్టరా పంగనామాలు అన్నట్టు.
* నాకిన్ని గంజినీళ్ళు పోస్తావా, నీ కాకలి కాకుండా మందిస్తానన్నాడట. (మంత్రం చెపుతాను అన్నట్లు).
* నాకు ఆయుష్యమస్తు, నాకు ఆరోగ్యమస్తు అని దీవించుకొన్నట్లు.
* నాకు తెలియకుండా నంబికిష్టయ్యకు కనికెడు (కమికెడు) జుట్టా?
* నా పరీక్షా, నా రాగిచెంబుకు పరీక్షా?
* నాకు బెబ్బెబ్బే అంటే, నీకు బెబ్బెబ్బే, నీ అబ్బకు బెబ్బెబ్బే అన్నాడట.
* నాకులకు లోక భయమేల?
* నాకు లేక నాకుతుంటే, నీకు నైవేద్యమా?
* నాకు లేక నాకుతుంటే, నీకెక్కడ దెత్తునే దేకులాడి.
* నాకు లేక నాకుతుంటే, మూతులు నాకను వచ్చావా?
* నా కూడు, నా కల్యాట్లు నాకు తప్పవు (కల్యాట్లు= అగసాట్లు, కష్టాలు).
* నాకు నాపిల్లకూ నూరేండ్లాయుస్సు, నా పెనిమిటికి లోకంతో పాటు.
* నాకూ లేదు, నీకూ లేదు, ఊరుకో దేవరా.
* నాకు సిగ్గులేదు, రేపు వచ్చే అమావాస్యకూ సిగ్గు (ఎగ్గు) లేదు.
* నాకే కుక్కకు, లింగమేమి? పానపట్టమేమి?
* నా కోడీ, కుంపటీ లేకపోతే ఎట్లా తెల్లవారుతుందో - ఎట్లా నిప్పు దొరుకుతుందో చూస్తాను అందిట ఒక అవ్వ.
* నాగరికం లేని మాట, నాలుకపై తీట.
* నాగలిఉన్న ఊళ్ళో ఆకలి చేరదు.
* నాగలి మంచిది కాకపోతే, ఎడ్లేమి చేస్తాయి?
* నా గర్భదానం నేనున్నట్లే జరపండి, నాకు రానుతీరిక లేదు అన్నాడట.
* నాగసముద్రం పిల్ల, నగారు మీద పుల్ల.
* నాగుబాము చిన్నదనవద్దు, పాలివాడు సన్నమనవద్దు.
* నా చెయ్యి నొస్తున్నది, నీ చేతితో మొత్తుకో అన్నట్లు.
* నా చెవులూ కంసాలే కుట్టాడు.
* నా చేతిమాత్ర వైకుంఠయాత్ర అన్నాడట వైద్యుడు. (చేతివాసి లేని వైద్యుని మాట).

No comments:

Post a Comment