* నాజూకు నక్కలు దేకితే, నెరసిన గడ్డం కుక్కలు పీకినవి.
* నాత్యం త్రొక్కిన కాలు, రోసి రోటిక్రింద పెట్టినా ఊరుకోదట.
* నాడు ఉంటే నవాబుసాహెబు, అన్నముంటే అమీరు సాహెబు, చస్తే పీరు సాహెబు.
* నాడు కట్టాలేదు, నేడు చింతాలేదు.
* నాడు నులువబడా లేదు, నేడు ఎత్తుబడా లేదు.
* నాడుపోయి, నేడొస్తివా మగడా! నా తప్పేమి చెప్పు?
* నాడు లెంచేవారేగానీ, గోడు చూచేవారు లేరు.
* నాడు వ్రాసినవాడు నేడు చెఱపి మళ్ళీవ్రాస్తాడా? (నుదుటివ్రాత).
* నాతి బలము నాలుకపైన.
* నాథుడులేని రాజ్యం నానా దారులు.
* నాదగ్గర ధనమున్నంతవరకు నన్ను అందరూ ' అన్నా ' అని పిలిచినారు.
* నాదముంటే గంట, వాదముంటే తంట.
* నాదయలో నీ గంజి త్రాగు అన్నట్లు.
* నాదికాదు, నా అత్త సొమ్ము అన్నట్లు.
* నాదుక్కటీ, నారెడ్డివి (మారెడ్డోరివి) కలిసి నూటొక్క ఎద్దన్నట్లు (ఇతనిది ఒకటే).
* నాదెంత గడ్డం, ఉమ్మి పూసి గొరగ మన్నాడట.
* నా దెబ్బ గోలకొండ అబ్బా అన్నట్లు.
* నానబాలు పట్టమ్మా అంటే, ఏచేని సజ్జలు అన్నదట.
* నానాకూళ్ళవాళ్ళు నాయుళ్ళు అయినట్లు.
* నానాటికి తీసికట్టు నాగంభొట్టు.
* నానారుచులు పారితే నాలుకమీద కొఱివి పెట్టుకొన్నట్లుంది.
* నానిన భూమి నవధాన్యాలు పండును.
* నా నోట్లో (నీవు) వేలు పెట్టు, నీకంట్లో (నేను) వేలు పెడతానన్నట్లు.
* నాన్చి నాన్చి వేస్తివో, నా కొంప తీస్తివో.
* నాన్పుడుగాడు నా పెండ్లికి నేనూ వెళ్ళాలా? అన్నట్లు.
* నాపప్పు కలిసిందంతా నేనే తింటాను.
* నా పాతివ్రత్యం నా మొదటి పెనిమిటికి తెలుసు.
* నాపాపము నాతోనుంటే శ్రీపతిబిరుదమునకేమి బ్రతుకు?
* నా పెండ్లాన్ని లేవదీసుకు పోతేపోయినాడుకానీ పదిమందిలో ఉసే అంటాడేమో అను భయంగా ఉన్నదన్నాడుట.
* నా పెండ్లి సగమైన దంటే, ఎట్లానయ్యా అంటే, నేను పెండ్లికొడుకుగా సిద్ధంగా ఉన్నాను; మిగతా సగానికి పెండ్లికూతురే కావాలన్నాడట.

No comments:
Post a Comment